Farmers Protest for Electricity: పగటిపూట విద్యుత్​ సరఫరా చేయాలని.. మాళపురం విద్యుత్​ స్టబ్​ స్టేషన్ వద్ద రైతుల ఆందోళన - ఏపీ రైతులు సమస్యల వార్తలు

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 10, 2023, 5:58 PM IST

Farmers Protested for Electricity at Vidapanakal : పొలాలకు తొమ్మిది గంటలు విద్యుత్​ను సరఫరా చేయాలని అనంతపురం జిల్లా విడపనకల్లు మండలంలోని రైతులు మాళపురం విద్యుత్ సబ్​ స్టేషన్​ వద్ద ఆందోళనలు చేపట్టారు. టీడీపీ నాయకులు రైతులకు మద్దతు తెలిపారు. వ్యవసాయానికి సక్రమంగా విద్యుత్​ సరఫరా చేయాలని రైతులు డిమాండ్​ చేశారు.

మాళపురం విద్యుత్​ సబ్ స్టేషన్ వద్ద వ్యవసాయానికి పగటి పూట విద్యుత్​ను సరఫరా చేయాలని అధికారులను కోరారు. లక్షలు పెట్టుబడి పెట్టి పంటలు సాగు చేశామని.. వానలు లేక పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం  చేశారు. సక్రమంగా విద్యుత్​ సరఫరా చేస్తే.. పొలాలకు బోర్ల ద్వారా నీటిని మళ్లించుకుని పంటలు పండించుకుంటామని అన్నారు. పొలాలకు సక్రమంగా విద్యుత్​ ఎందుకు ఇవ్వటం లేదని రైతులు అధికారులను ప్రశ్నించారు. రాత్రి పూట వద్దు.. కనీసం పగటి సమయంలో విద్యుత్​ను సరఫరా చేస్తే చాలు అని  రైతులు అధికారులను డిమాండు చేశారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.