పుంగనూరులో ఉద్రిక్తత - ఎలక్ట్రిక్ బస్సుల పరిశ్రమ ఏర్పాటుపై రైతుల నిరసన, భారీగా పోలీసుల మోహరింపు - AP Latest News

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 1, 2023, 9:07 PM IST

Farmers Protest Against Establishment of Electric Bus Industry: వైసీపీ మంత్రి పెద్దిరెడ్డి రామ చంద్రారెడ్డి (YCP Minister Peddireddy Rama Chandra Reddy) ప్రాదినిధ్యం వహిస్తున్న నియోజక వర్గంలో ఏర్పాటు చేయనున్న ఎలక్టిక్​ బస్సుల పరిశ్రమను వ్యతిరేకిస్తూ ప్రజలు పెద్ద ఎత్తున బయటకు వచ్చి నిరసన తెలిపారు. ఆ పరిశ్రమలకు తమ భూములిస్తే తమ పరిస్థితి ఏంటంటూ ప్రశ్నిస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే

Tension in Gopishettipalle: చిత్తూరు జిల్లా పుంగనూరులోని గోపిశెట్టిపల్లెలో పోలీసులు భారీగా మోహరించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గోపిశెట్టిపల్లెలో ఏర్పాటు కానున్న ఎలక్ట్రిక్ బస్సుల పరిశ్రమను (Electric buses industry in Gopishettipalle) వ్యతిరేకిస్తూ గ్రామస్తులు రోడ్డెక్కారు. పరిశ్రమ ఏర్పాటుకు తమ భూములు ఇవ్వబోమంటూ భీష్మించుకుని కూర్చున్నారు. పరిశ్రమ ఏర్పాటుపై సమీక్షించేందుకు పెప్పర్ ఎలక్ట్రిక్ బస్సుల ప్రతినిధులు పుంగనూరుకు రానున్నారు. ఈ సందర్భంలో స్థానికులు నిరసనకు (Farmers protest in Gopishettipalle) దిగారు. అప్రమత్తమైన పోలీసులు భారీగా బలగాలను మోహరించారు. గోపిశెట్టిపల్లె గ్రామస్థులు పుంగనూరుకు రాకుండా నిర్బంధించారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.