Fan Love on Chiranjeevi: చిరంజీవిపై వీరాభిమానం.. పొర్లుదండాలతో తిరుమలకు - Megastar fans

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 22, 2023, 5:50 PM IST

Megastar Chiranjeevi  Birthday Celebrations : మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఓ వ్యక్తి తన అభిమానాన్నిచాటుకుంటున్నారు. చిరంజీవి, ఆయన కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలం బలిజపల్లికి చెందిన ఈశ్వర్ రాయల్ శ్రీవారి మెట్టు మార్గం ద్వారా పొర్లుదండాలతో తిరుమలకు పయనమయ్యారు. శ్రీవారి మెట్టు కాలినడక మర్గం దగ్గర కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు.. ప్రతి ఏటా ఆయన పుట్టినరోజు సందర్భంగా పలు పుణ్యక్షేత్రాల్లో విన్నూత్న కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. మంగళవారం శ్రీవారిమెట్టు మార్గం ద్వారా 2388 మెట్లు పొర్లుదండాలతో తిరుమలకు బయలుదేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2003వ సంవత్సరం నుంచి 20ఏళ్లుగా చిరంజీవి కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ పలు పుణ్యక్షేత్రాలలో విన్నూత్న కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గతంలో కూడా తిరుపతి నుంచి కొండగట్టు వరకు సైకిల్ యాత్ర చేశానన్నారు. మోకాళ్ల శస్త్ర చికిత్స చేయించుకున్న అన్నయ్య చిరంజీవి త్వరగా కోలుకోవాలని.. ఆ కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని వేడుకున్నట్లు ఈశ్వర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మెగాస్టార్ అభిమానులు పాల్గొన్నారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.