prathidwani: ఉద్యోగ ఖాళీల క్యాలెండర్ కోసం ఎదురుచూస్తున్న నిరుదోగులు
🎬 Watch Now: Feature Video
వైస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే.. మెగా డీఎస్సీ. ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులన్నీ భర్తీ. ఏటా జనవరి 1నే క్రమం తప్పకుండా.. జాబ్ క్యాలెండర్ విడుదల. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2 లక్షల 30 వేల పోస్టుల భర్తీ. ఎన్నికలకు ముందు వైఎస్సార్సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన ఈ హామీల అమలు ఏమైంది ? ఇప్పుడు రాష్ట్రంలో నిరుద్యోగ యువత సంధిస్తున్న సూటి ప్రశ్న ఇది. చూస్తుండగానే అధికారంలోకి వచ్చి.. నాలుగేళ్లు పూర్తి కావొస్తోంది. మరో ఏడాదిలో రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు రాబోతున్నాయి. మరి.. మారిన ఇన్నేళ్ల క్యాలెండర్‌లలో వచ్చిన జాబ్ క్యాలెండర్లు ఎన్ని? ఉద్యోగ నియామక పత్రాలు అందుకున్నది ఎంతమంది? నిరుద్యోగ యువత దగాపడ్డామన్న ఆక్రోశంతో మళ్లీ రోడ్లపైకి ఎందుకు వస్తున్నారు? నాడు ఇచ్చిన ఈ హామీలు అమలుకు నోచుకున్నాయా? కొలువుల సాధనకు యువత కార్యాచరణ ఎలా ఉండనుంది? ఉద్యోగాల భర్తీలో ఇంత జాప్యం ఎందుకు జరుగుతోంది? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.