దేశంలో నెం.1 ప్రాంతీయ ఉద్యోగ భవిష్య నిధి కార్యాలయం రాజమహేంద్రవరంలోనే... - తూర్పు గోదావరి తాజా వార్తలు
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/04-11-2023/640-480-19940723-thumbnail-16x9-epfo-regional-office-bhavisya-nidhi--award.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 4, 2023, 4:09 PM IST
EPFO Regional OFfice Bhavisya Nidhi Award : రాజమహేంద్రవరంలోని ప్రాంతీయ ఉద్యోగ భవిష్య నిధి కార్యాలయం చిన్న తరహా కార్యాలయాల్లో దేశంలో ఉత్తమమైనదిగా ఎంపికైంది. ఆ సంస్థ 71వ వ్యవస్థాపక దినోత్సం వేళ ప్రకటించిన భవిష్య నిధి అవార్డ్ 2023 రాజమహేంద్రవరం ప్రాంతీయ ఈపీఎఫ్ కార్యాలయానికి దక్కింది. వాటాదారుల సమస్యల పరిష్కారంలో తమ సేవలకు మెచ్చి అవార్డు ఇచ్చారని ప్రాంతీయ పీఎఫ్ కమిషనర్ మనోజ్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు.
'దేశ వ్యాప్తంగా 84 చిన్న ఈపీఎఫ్ కార్యాలయాల్లో మా రాజమహేంద్రవరం శాఖ ఉత్తమమైనదిగా ఎంపికైంది. కేంద్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి రామేశ్వర్ తేలి చేతుల మీదుగా అవార్డు అందుకోవడం జరిగింది. దేశంలోనే మా కార్యాలయం ప్రథమ స్థానంలో నిలవడం పట్ల గర్వంగా ఉంది.' -మనోజ్ కుమార్, ప్రాంతీయ పీఎఫ్ కమిషనర్
'ప్రజలకు ఉత్తమైన సేవలు అందించడం మా లక్ష్యం. వినియోగదారుల పెదవుపై చిరునవ్వే మా ధ్యేయం. మా కార్యాలయం ఈ రెండిటికి కట్టుబడి పని చేస్తుంది. దానికి ఫలితమే అవార్డు.' -శ్రీనివాస్, అసిస్టెంట్ ప్రాంతీయ పీఎఫ్ కమిషనర్