Elephant Attack on Bus: మన్యం జిల్లాలో బస్సుపై ఏనుగు దాడి.. భయాందోళనతో ప్రయాణికుల పరుగులు - మన్యం జిల్లాలో బస్సుపై ఏనుగు దాడి

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 4, 2023, 5:01 PM IST

Elephant Attack on Bus in Parvathipuram: పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం ఆర్తాం రహదారిలో ఏనుగు బీభత్సం సృష్టించింది. రహదారిలో వెళ్తున్న బస్సుపై ఏనుగు దాడి చేయగా బస్సు అద్దాలు ధ్వంసం అయ్యాయి. నడిరోడ్డులో నిల్చొని హల్​చల్​ చేయడంతో స్థానికులు భయభ్రాంతులతో పరుగులు తీశారు. పది రోజుల క్రితం గుంపు నుంచి విడిపోయిన ఏనుగులు, అటవీ ప్రాంతాన్ని వీడి.. జనసమూహాల్లో సంచరిస్తున్నాయి. తాజాగా ఓ ఏనుగు రహదారిపై హల్​చల్ చేసింది. ఈ క్రమంలో ఎదురొచ్చిన వాహనాలు, ప్రయాణికులపైనా దాడులకు యత్నించింది. 

ఈ రోజు ఉదయం కొమరాడ మండలం అర్తాంలో ఒడిశా రాష్ట్రం రాయగడ నుంచి పార్వతీపురం వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సును అడ్డగించింది. అంతటితో ఆగకుండా.. అద్దాలను ధ్వంసం చేసింది. దీంతో భయాందోళనకు గురైన ప్రయాణికులు.. పరుగులు తీశారు. గత పది రోజుల నుంచి ఒంటరి ఏనుగు జనావాసాల్లో తిరుగుతూ దాడులకు పాల్పడుతుండటంతో.. స్థానికులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఏనుగు నుంచి ఏ సమయంలో ఎలాంటి ముప్పు సంభవిస్తుందోనని భయాందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా అటవీశాఖ అధికారులు తగు చర్యలు తీసుకోవాలని మన్యం జిల్లా ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.