CM Jagan on Pre Elections: షెడ్యూల్​ ప్రకారమే ఎన్నికలు.. మంత్రులకు సీఎం జగన్​ స్పష్టం - ఎన్నికలపై జగన్​ క్లారిటీ

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jun 7, 2023, 5:55 PM IST

Updated : Jun 7, 2023, 6:01 PM IST

CM Jagan Clarity on Elections: రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలపై సీఎం జగన్​ క్లారిటీ ఇచ్చారు. ముందస్తు ఎన్నికలపై వస్తున్న ఊహాగానాలకు నేడు జరిగిన మంత్రుల సమావేశంలో సీఎం తెరదించారు. ఈ మేరకు కేబినెట్‌ సమావేశంలో మంత్రులకు స్పష్టంగా తెలియజేశారు. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని తేల్చిచెప్పారు. కేబినెట్‌ భేటీ తర్వాత మంత్రులతో.. సీఎం జగన్ సుమారు గంటసేపు చర్చించారు. ముందస్తు ఎన్నికలపై జరుగుతున్న ప్రచారంపై.. మంత్రులతో జగన్‌ మాట్లాడారు. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలుంటాయని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఇంకో 9 నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయని మంత్రులకు జగన్ క్లారిటీ ఇచ్చేశారు. ఎన్నికల కోసం ఇంకా 9 నెలల సమయం ఉందన్న జగన్‌... అందరూ గట్టిగా పని చేయాలని సూచించారు. ఈ 9 నెలలు బాగా కష్టపడాలని మంత్రులకు ఈ సందర్భంగా సీఎం సూచించారు. ఇప్పుడు కష్టపడితే మళ్లీ గెలుపు తమదేనని ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు సచివాలయంలో సీఎం జగన్‌ అధ్యక్షతన భేటీ అయిన మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.

Last Updated : Jun 7, 2023, 6:01 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.