ఇంటర్మీడియట్‌ తర్వాత ఎలాంటి అవకాశాలు ఉంటాయో - కేఎల్ యూనివర్శిటీ- ఈనాడు "దిశ దశ" సదస్సు - విద్యార్థులకు KL యూనివర్సిటీ అవగాహన కార్యక్రమం

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 2, 2023, 9:44 AM IST

Eenadu And KL University Conduct Awareness Program to Intermediate Students : విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత స్థితికి చేరుకోవాలంటే ఇంటర్మీడియట్‌ తర్వాత పై చదువుల కోసం మంచి విద్యా సంస్థను ఎంచుకోవాలని కేఎల్ యూనివర్శిటీ అడ్మిషన్స్ డైరెక్టర్ జె. శ్రీనివాసరావు సూచించారు. ఈనాడు - కేఎల్ యూనివర్శిటీ సంయుక్త ఆధ్వర్యంలో భీమవరం శ్రీచైతన్య కళాశాలలో నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కేఎల్ యూనివర్శిటీ అందిస్తున్న కోర్సులు, వాటి ప్రత్యేకతలు, విద్యార్థులు కేఎల్ యూనివర్శిటీలో చేరడం ద్వారా కలిగే ప్రయోజనాలు ఆయన వివరించారు. ఐటీ రంగంలో ఉపాధి అవకాశాలు విస్తృతంగా ఉన్న తరుణంలో విద్యార్థులు మంచి విద్యాసంస్థను ఎంచుకోవడం ద్వారా జీవితంలో స్థిరపడే అవకాశాలు మెండుగా ఉంటాయని వివరించారు.

Eenadu Dasha Disha Awareness Conference in Bhimavaram : విద్యార్థులు ఇంటర్ దశ నుంచే మంచి క్రమశిక్షణ కలిగి ఉండి, మంచి విద్యాసంస్థను ఎంచుకోవడం ద్వారా జీవితంలో తొందరగా స్థిరపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని శ్రీచైతన్య విద్యాసంస్థల ఏజీఎం హరిప్రసాద్ సూచించారు. విద్యార్థులకు వర్తమాన, సామాజిక అంశాలతో పాటు విద్యా, ఉద్యోగ అవకాశాలు, విద్యా సంస్థల వివరాలను అందించడంలో 'ఈనాడు' సంస్థ ఎప్పుడూ ముందుంటుందని తాడేపల్లిగూడెం ఈనాడు యూనిట్ ఇంఛార్జి ఎం. వెంకటేశ్వర్లు వెల్లడించారు. ఈ సదస్సుకు విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఇంటర్మీడియట్‌ తర్వాత ఇంజనీరింగ్‌ విద్య, ఐటీ రంగం ,వైద్య రంగం, ఉపాధి, ఉద్యోగ అవకాశాలపై విద్యార్థులకు అనుభవజ్ఞులు దిశానిర్దేశం చేశారు. 

Organises Awareness Meet After Intermediate Education to Students :అనంతరం ఇంటర్ మొదటి ఏడాదిలో బైపీసీ, ఎంపీసీ విభాగాల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను కేఎల్ యూనివర్శిటీ ప్రతినిధులు అభినందించారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.