DRDO NS and M DG అత్యోన్నత సంస్థలో తెలుగు వ్యక్తికి కీలక పదవి.. డీఆర్డీవో డీజీగా శ్రీనివాసరావు - DRDO NS and M DG
🎬 Watch Now: Feature Video
DRDO Naval Systems and Materials DG: డీఆర్డీవోలో తెలుగు వ్యక్తికి మరో కీలక పదవి వరించింది. డాక్టర్ వై.శ్రీనివాసరావు డీఆర్డీవో నావెల్ సిస్టమ్స్, అండ్ మెటీరియల్స్ డైరక్టర్ జనరల్‌గా బాధ్యతలను చేపట్టారు. డాక్టర్ శ్రీనివాసరావు నీటిలో పని చేసే ఆయుధాలను, వాటికి సంబంధించిన అంశాలలో నిపుణుడు. 2000 సంవత్సరంలో డీఆర్డీవోలో చేరిన ఈయన వివిధ హోదాలలో పని చేశారు. 22 ఏళ్లుగా వివిధ సాంకేతికతను అభివృద్ధి చేశారు. కమ్యూనికేషన్ల వ్యవస్థలను సిద్ధం చేయడం.. మిస్సైళ్లు, వార్ హెడ్లకు వాటిని అనుసంధానం చేయడంలో కీలక పాత్ర పోషించారు.
హైదరాబాద్ జేఎన్టీయూ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్‌లో పట్టా పొందిన శ్రీనివాసరావు, ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్డీ పట్టా పొందారు. దాదాపు రెండేళ్లకు పైగా ఈయన విశాఖ ఎన్ఎస్టీఎల్ డైరక్టర్‌గా బాధ్యతలను నిర్వర్తించారు. బీహెచ్ఈఎల్లో తన ఉద్యోగ జీవితాన్ని ఆరంభించిన శ్రీనివాసరావు.. ప్రధానంగా టర్బైన్లులో విశేషంగా ప్రతిభను కనబర్చారు. హిట్ టు కిల్ మిస్సైల్ రూపకల్పనలోనూ ముఖ్య పాత్ర పోషించారు. రిపబ్లిక్ డే పరేడ్‌లో శక్తి మిషన్ ఎశాట్ శాస్త్రవేత్తల బృందానికి ఈయన నాయకత్వం వహించిన తొలి శాస్త్రవేత్త.