Dogs Attack: బౌబోయ్​ కుక్కలు.. ఒకేరోజు 20 మందిపై దాడి - నెల్లూరు జీజీహెచ్​లో అందుబాటులో లేని టీకాలు

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : May 1, 2023, 7:48 PM IST

Dogs Attack : రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పిచ్చి కుక్కల స్వైరవిహారంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. గ్రామ సింహాల వీర విహరంతో ప్రజలు పరుగులు పెట్టారు. ఎన్టీఆర్​ జిల్లాలో కుక్క దాడికి ఓ వృద్ధుడు తీవ్రగాయాలపాలై.. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నాడు. మరోవైపు నెల్లూరులో పిచ్చి కుక్క దాడిలో 20మందికి పైగా గాయాలపాలయ్యారు. కుక్క దాడితో వారు ప్రభుత్వాసుపత్రికి పరుగులు పెట్టగా.. అక్కడ టీకాలు అందుబాటులో లేక బాధితులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

అసలేం జరిగిందంటే : ఎన్టీఆర్​ జిల్లాలోని నందిగామ మండలానికి చెందిన పెద్దవరం గ్రామంలో ఆదివారం సాయత్రం ఓ పిచ్చి కుక్క నలుగురు వ్యక్తులతోపాటు, ఓ గేదెపై దాడి చేసింది. ఈ దాడిలో ఓ వృద్ధుడు తీవ్రగాయాలపాలయ్యాడు. ఒకే గ్రామంలో నలుగురిపై దాడి చేయటంతో గ్రామంలోని ప్రజలు భయందోళనకు గురవుతున్నారు.

మరోవైపు నెల్లూరు నగరంలో పిచ్చికుక్క నగర వాసులకు ముచ్చెమటలు పట్టించింది. గాంధీ బొమ్మ, వీఆర్సీ సెంటర్​లో విహరిస్తూ.. పాదచారులపై దాడి చేసింది. ఈ దాడిలో 20 మందికి పైగా గాయాలపాలయ్యారు. ఈ ఘటనతో నగరవాసులు బెంబేలెత్తగా.. కుక్క దాడిలో గాయలపాలైన వారు చికిత్స కోసం జీజీహెచ్​కు వెళ్లారు. దీంతో అక్కడ 20మందికి సరిపడా టీకాలు లేకపోవటంతో బాధితులు ఇబ్బంది పడ్డారు. టీకాలు అందుబాటులో లేకపోవటంతో.. బయట మెడికల్​ షాపుల్లో కొనుగోలు చేసి.. చికిత్స తీసుకున్నారు. దాడికి పాల్పడిన పిచ్చికుక్కను కార్పొరేషన్​ సిబ్బంది పట్టుకుని బంధించారు.  

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.