డాక్టర్ కాదు చీటర్ - MBBS సీటు ఇప్పిస్తానని రూ.18 లక్షలకు టోకరా - fraud doctor in nellor
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 8, 2023, 8:22 PM IST
Doctor Cheated taking 18 lakhs to give MBBS Seat: నిస్వార్థంగా రోగులకు వైద్యం అందించే పవిత్రమైన వైద్య వృత్తిలో ఉండి మోసాలకు పాల్పడుతున్న డాక్టర్‌ను, మరో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. మెడికల్ సీట్లు ఇప్పిస్తానని లక్షల రూపాయలు తీసుకుని మోసం చేసాడని ఓ మహిళ ఫిర్యాదుతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఎంబీబీఎస్ సీటు కోసం విడతల వారీగా డబ్బులు చెల్లించి 8నెలలు అవుతున్నా సీటు రాలేదేంటని ప్రశ్నించినందుకు దుండగులు ఆమెపై దాడికి పాల్పడ్డారు.
ఇదీ జరిగింది: నెల్లూరు జిల్లాలో అనిత అనే వివాహిత పిండిమిల్లు నడుపుతూ జీవనం సాగిస్తుంది. ఈమె కుమారుడు నీట్ పరీక్షలకు ప్రయత్నిస్తున్నాడు. నీట్లో ఆశించిన స్థాయిలో ర్యాంకు రాకపోవడంతో నిరాశ చెందారు. ఈ విషయాన్ని డాక్టర్ వృత్తిలో ఉన్న అశ్వనీకుమార్ ఆసరాగా తీసుకున్నాడు. రూ.18లక్షలు ఇస్తే మెడికల్ సీటు ఇప్పిస్తానని మాయమాటలు చెప్పాడు. ఇదంతా నిజమని నమ్మిన అనిత డాక్టర్‌కు విడతల వారీగా డబ్బులు చెల్లించింది. డబ్బులు చెల్లించి 8నెలలు కావొస్తున్నా వారి నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో అనుమానం వచ్చిన అనిత అశ్వినీకుమార్ను నిలదీసింది. దీంతో ఆగ్రహానికి గురైన డాక్టర్, మరో ఇద్దరు కలిసి ఆమెపై దాడి చేశారు. తీవ్రగాయాలతో వైద్యచికిత్స తీసుకున్న అనంతరం అనిత పోలీస్ లకు ఫిర్యాదు చేశారు. ఈమె ఫిరాద్యుతో నిందుతులపై 307కేసు నమోదు చేసి, పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.