" ముసలోడే కాని మహానుభావుడు".. నవ్వులు పూయిస్తున్న ప్రీ వెడ్డింగ్ షూట్ డైరక్షన్ - Direct instructions of sailor who steers the boat
🎬 Watch Now: Feature Video
ఉత్తరాంధ్రకు చెందిన ఓ జంట ప్రీ వెడ్డింగ్ ఫొటో షూట్‌ను డిఫరెంట్‌గా చేసుకోవాలనుకునే ఉద్దేశ్యంతో.. చిన్నపాటి నదిని లొకేషన్‌గా ఎంచుకున్నారు. అక్కడ వారికి ఒక వింత అనుభవం ఎదురైంది..
విషయానికి వస్తే.. సాధారణంగా ఫొటో షూట్ అంటే కెమెరామెన్ ఫోజులు చెప్తుంటే వధూవరులు ఇద్దరూ స్టిల్స్ ఇస్తుంటారు. కానీ ఇక్కడ అంతా రివర్స్‌లో జరిగింది.. ఫొటో షూట్‌కు వచ్చిన ఈ జంటకు అనుహ్యమైన అనుభవం ఎదురైంది. ఫొటోలైతే తీసుకున్నారు. ఎవరి దర్శకత్వంలో తీసుకున్నారో తెలుసా.. నాటు పడవ నడిపే నావికుడి దర్శక సూచనలు పాటిస్తూ. అంతేకాక ఆ నావికుడి వయస్సు ఖచ్చితంగా ఐదు పదులు దాటే ఉంటుంది. పడవ నడిపే వ్యక్తి ఫొటో షూట్‌కి దర్శకత్వం వహించడమేంటని అనుకుంటున్నారా. పడవ నడిపే వ్యక్తే స్వయంగా వర్ణిస్తూ ఫొటో ఇలా దిగండి, అలా దిగండని జంటకు వివరించాడు. అతడు ఇచ్చిన సూచనలు, వర్ణించిన తీరు చూస్తే మాత్రం మీరు అరే ఏంట్రా ఇది అని మాత్రం అనకుండా ఉండలేరు. మాములుగా లేదు కెమెరామెన్లు చూస్తు ఉండిపోయే విధంగా ఉన్నాయి.
ఈ సంఘటనని వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పెట్టారు. ఇప్పుడు ఆ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. చూసిన నెటిజన్లు " ఏంట్రా నువ్వు ఇంత టాలెంటెడ్‌లా ఉన్నావు" అని " ముసలోడే కాని మహాను భావుడు" అని "తాత ఇలాంటివి ఎన్ని చూసుంటాడో" అని తెగ కామెంట్స్ చేస్తున్నారు.. ఇంతలా నవ్వులు పూయించిన ఈ వీడియోలో జంటకు ఫొటో ఫోజులు వర్ణించిన తీరు.. ఎలా ఉన్నాయో మీరు ఓ లుక్కేయండి..
ఇవీ చదవండి: