పోలీసులను జగన్ ప్రైవేట్ సైన్యంలా వాడుతున్నారు - భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోక తప్పదు : ధూళిపాళ్ల
🎬 Watch Now: Feature Video
Dhulipalla Narendra allageations on AP CID: హైదరాబాద్‌లో తెలుగుదేశం నేత కిలారు రాజేష్‌ను కౌంటర్ ఇంటిలిజెన్స్ పోలీసులు వెంటాడటం.. దారుణమని మాజీ శాసనసభ్యులు ధూళిపాళ్ల నరేంద్రకుమార్ మండిపడ్డారు. చట్టప్రకారం, రాజ్యాంగానికి లోబడి పనిచేయాల్సిన ఏపీ కౌంటర్ ఇంటిలిజెన్స్..సీఐడీ విభాగాలు జగన్ రెడ్డి కనుసన్నల్లో పనిచేస్తున్నాయని విమర్శించారు. రాజకీయ ప్రత్యర్థుల్ని వెంటాడి..వేధించాలన్న జగన్ ఆలోచనల మేరకే కౌంటర్ ఇంటిలిజెన్స్ డీజీ పీఎస్ఆర్. ఆంజనేయులు, సీఐడీ డీజీ రఘురామిరెడ్డి పరిధి దాటి పనిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు.
కిలారు రాజేశ్ కేవలం సాక్షి మాత్రమేనని మొదట చెప్పి, తర్వాత దోషిగా పేర్కొని లుక్ఔట్ నోటీసు ఇవ్వడం సీఐడీ పనితీరుని ఎత్తిచూపుతోందన్నారు. జగన్ ముఖ్యమంత్రి ఆధ్వరంలో జరుగుతున్న వ్యవస్థల సర్వనాశనంలో భాగమే కౌంటర్ ఇంటిలిజెన్స్ సిబ్బందిని రాజకీయ కక్షలకు వాడుకోవడమని ఆక్షేపించారు. ఏపీలో సీఎం జగన్ పోలీసులను ప్రైవేట్ సైన్యంలా వాడుతున్నారని ధూళిపాళ్ల నరేంద్ర ఆరోపించారు. జగన్ సీఎం అయిన తరువాత ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రశ్నిస్తే వారిపై కేసులు పెట్టడం పరిపాటిగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కిలారి రాజేష్ విషయంలో సీఐడీ వైకరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఐడీ అధికారులు కోర్టుల్లో ఓ మాటా... బయట ఓ మాట మాట్లాడుతున్నారని ధూళిపాళ్ల నరేంద్ర ఆరోపించారు. చట్టవిరుద్ధంగా పనిచేసే అధికారులు భవిష్యత్‌లో కచ్చితంగా తగిన మూల్యం చెల్లించుకుంటారని నరేంద్రకుమార్ హెచ్చరించారు.