Missed a Train Accident: నర్సాపూర్ - ధర్మవరం ఎక్స్‌ప్రెస్ రైలుకు తప్పిన ప్రమాదం.. - Dharmavaram Express Missed train Accident
🎬 Watch Now: Feature Video
Dharmavaram Express train Missed Accident: నెల్లూరు జిల్లా కావలి, బిట్రగుంట రైల్వే స్టేషన్ల మధ్య నర్సాపూర్ నుంచి ధర్మవరం వెళ్లే ఎక్స్‌ప్రెస్ రైలుకు ఘోర ప్రమాదం తప్పింది. ఎగువ మార్గంపై ముసునూరు సమీపంలో రెండు మీటర్లు పొడవున్న రైలు పట్టా ముక్కను గుర్తు తెలియని దుండగులు ట్రాక్‌పై అడ్డుగా పెట్టారు. అది గమనించిన లోకోపైలెట్ అప్రమత్తమై.. వెంటనే రైలు వేగాన్ని నియంత్రించారు. తక్కువ వేగంతో వస్తున్న రైలు.. పట్టా ముక్కను ఢీకొంది. దీంతో రైలు పట్టా దూరంగా ఎగిరి పడటంతో అదృష్టవశాత్తూ ప్రమాదం తప్పింది. వెంటనే లోకో పైలెట్ రైలును నిలుపుదల చేశారు. దీనిపై సమాచారం అందిన వెంటనే రైల్వే ఉన్నతాధికారులు ఘటనాస్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. ఇది సంఘ విద్రోహశక్తుల పనా.... లేక ఆకతాయిల పనా అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఎక్స్‌ప్రెస్ రైలు ఇంజన్ ముందు ఉండే సేఫ్టీ గార్డు తగిలి పట్టా ముక్క పక్కకు పడిపోవడంతో ప్రమాదం జరగలేదు. పట్టాకు అడ్డంగా పెట్టిన ఇనుప ముక్కను ఇంజన్ ఎక్కి ఉంటే పెను ప్రమాదం జరిగి ఉండేదని అధికారులు భావిస్తున్నారు.