Illegal constructions in Addanki: వైఎస్సార్సీపీ నేత ఫోన్..! నిలిచిపోయిన అక్రమ కట్టడాల కూల్చివేత - YCP leader stopped demolition of illegal building
🎬 Watch Now: Feature Video
Demolition Of Illegal Structures In Addanki: బాపట్ల జిల్లా అద్దంకి పట్టణంలోని ప్రభుత్వ భూముల ఆక్రమణలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. పట్టణంలో స్థలాల ధరలు ఆకాశాన్నంటుతున్న తరుణంలో ప్రభుత్వ స్థలాలకు రక్షణ కొరవడింది. నామ్ రహదారి వెంట ఖాళీ స్థలాలు కనపడితే చాలు.. ఓ సామాజిక వర్గానికి చెందిన వారు నివాస, వ్యాపార కేంద్రాలు మార్చుకుంటున్నారు. జూలై11న జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు పట్టణంలోని ఉత్తర అద్దంకి వద్ద 2.13 ఎకరాల భూమిలో గల అక్రమ కట్టడాలను తొలగించేందుకు రెవెన్యూ అధికారులు ప్రొక్లైన్‌తో వెళ్లారు. కాగా, నిర్మాణాలను తొలగించొద్దంటూ ఆక్రమణదారులు అడ్డుగా నిలిచి స్థానిక వైఎస్సార్సీపీ ఇంఛార్జ్‌కు సమాచారం అందించారు. అలాగే ఆ సమయంలో నామ్ రహదారిపై వెళ్తున్న వైఎస్సార్సీపీ ఇంఛార్జ్ వద్దకు వెళ్లి కూల్చివేతలు అడ్డుకోవాలని కోరారు. దీంతో సదరు నాయకుడు రెవెన్యూ అధికారులకు ఫోన్ చేసి అక్రమ కట్టడాల తొలగింపు పనులు నిలిపేయాలి ఆదేశించినట్లు సమాచారం. ఈ విషయంపై స్థానిక అధికారులను వివరణ కోరగా... 'పైవారు ఎలా చెప్తే.. అలా నడుచుకోవాలి కదా..' అని నిట్టూరుస్తున్నారు.