ఉపాధ్యాయులు బాగుంటేనే - విద్యార్థులు బాగుపడతారు! జీపీఎస్‌ను రద్దు చేయండి - ఓపీఎస్ ను కొనసాగించండి - విజయవాడలో ఉపాధ్యాయుల ధర్నా
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 9, 2023, 5:00 PM IST
Democratic Teachers Federation Dharna: పాఠశాల విద్యారంగాన్ని కాపాడాలని డిమాండ్ చేస్తూ డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్‌లో ఉపాధ్యాయులు ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మధు, పూర్వ అధ్యక్షులు కృష్ణయ్య మాట్లాడుతూ ప్రభుత్వ ఉత్తర్వులు 117ను రద్దుచేసి 3,4,5 తరగతుల తరలింపు నిలిపివేయాలని, జీపీఎస్ విధానాన్ని ఉపసంహరించుకొని పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేసారు.
జీవోలు 117, 128, 84, 85ల ప్రభావంతో వేలాది ప్రాథమిక పాఠశాలలో మూతకు గురవుతున్నాయని, ప్రాథమిక తరగతులు అందుబాటులో లేక పేద పిల్లలు ప్రైవేటు పాఠశాలల వైపు వెళ్లిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్‌ను, బకాయిలను తక్షణమే చెల్లించాలన్నారు. నూతన విద్యా విధానం 20-20 సిఫారసు మేరకు పాఠశాల విద్యలో మాతృభాష మాధ్యమాన్ని అమలు చేయాలన్నారు. ప్రతి నెల ఒకటవ తేదీన జీతాలు చెల్లించాలన్నారు. నాడు నేడు బాధ్యతల నుంచి ఉపాధ్యాయులను తప్పించాలని డిమాండ్ చేశారు.