నాలుగున్నరేళ్లుగా పూర్తికాని పనులు - తాగునీటి కోసం అనకాపల్లి వాసుల వెతలు - సురక్షిత మంచినీరు
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 5, 2024, 10:38 PM IST
Delay in Provision of Filtered Drinking Water: అనకాపల్లి జిల్లాలోని గ్రామ ప్రజలకు సురక్షిత తాగునీటిని అందించడంలో జాప్యం జరుగుతోందని స్థానికులు తెలిపారు. అగనంపూడి నుంచి అనకాపల్లికి సురక్షిత తాగునీటిని ప్రజలకు అందించడానికి 2019లో సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ ప్రాజెక్టు శంకుస్థాపన చేశారు. 32 కోట్ల రూపాయల వ్యయంతో పైప్ లైన్ పనులు చేపట్టి, సురక్షిత నీటిని ప్రజలకు అందించాలని నిర్ణయించారు. కానీ, శంకుస్థాపన జరిగి నాలుగున్నర సంవత్సరాలు గడిచినా ఇప్పటి వరకు పనులు పూర్తి కాలేదని స్థానికులు తెలిపారు.
17 కిలోమీటర్ల మేర చేపట్టాల్సిన నీటి పనులు కేవలం 9 కిలోమీటర్లు మాత్రమే పనులు మొదలుపెట్టారన్నారు. మిగిలిన పనుల్లో జరుగుతున్న జాప్యం కారణంగా అనకాపల్లి పట్టణ వాసులతో పాటు జీవీఎంసీలో వీలైనమైన గ్రామాలకు తాగునీరు దూరం అవుతోందని తెలిపారు. శారదా నది నుంచి నీటిని తోడి కుళాయిల ద్వారా నీటిని గ్రామాలకు అందిస్తున్నామని పేర్కొన్నారు. సురక్షిత నీరు ప్రజలకు అందకపోవడంతో రోగాలు పాలవుతున్నారు. ఇప్పటికైనా పరిశుభ్రమైన నీటిని ప్రజలకు అందించేందుకు పనులను వేగవంతం చేయాలని అనకాపల్లి ప్రజలు కోరుతున్నారు.