Decoration of Goddess with Currency Notes: అద్భుతం.. కరెన్సీ నోట్లతో అమ్మవారికి అలంకరణ - తూర్పుగోదావరి జిల్లా తాజా వార్తలు

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 25, 2023, 5:11 PM IST

Decoration of Goddess Temples with Currency Notes : శ్రావణమాసం రెండో శుక్రవారం, వరలక్ష్మీ వ్రతం సందర్భంగా తూర్పుగోదావరి జిల్లాలోని ప్రసిద్ధ అమ్మవార్లను కరెన్సీ నోట్లతో అలకరించారు. కడియపులంక ముసలమ్మతల్లి ఆలయంలో వరలక్ష్మీ వ్రతం సందర్భంగా  కరెన్సీ నోట్లతో అమ్మవారిని అలకరించారు. మొత్తం రూ. 31 లక్షల 25 వేల అన్ని రకాల కరెన్సీ నోట్లు, నాణేలతో ధవళేశ్వరానికి చెందిన విశ్వనాథ్ శర్మ బృందం అమ్మవారిని ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. గత నాలుగు సంవత్సరాల నుంచి అమ్మవారిని ఇలా కరెన్సీ నోట్లతో అలకరిస్తున్నారని ఆలయ పూజారి తెలిపారు. అలానే ఉండ్రాజవరం మండలం పాలంగి గ్రామంలోని కనకదుర్గ అమ్మవారి ఆలయానికి వరలక్ష్మీ వ్రతం సందర్భంగా భక్తులు పోటెత్తారు. వేకువ జాము నుంచి భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు అభిషేకాలు చేశారు. వరలక్ష్మీ వ్రతం సందర్భంగా అమ్మవారిని ధనలక్ష్మి అలంకారంలో తీర్చిదిద్దారు. కరెన్సీ నోట్లతో తయారు చేసిన దండలు తోరణాలు వివిధ రకాల ఆకారాలతో అమ్మవారిని అలంకరించారు. అమ్మవారితో పాటు అమ్మవారి గర్భాలయం, ముఖ మండపాన్ని నోట్ల తోరణాలతో ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. వరలక్ష్మీ వ్రతం నాడు ధనలక్ష్మి అలంకారంలో అమ్మవారిని దర్శించుకుంటే.. అష్టైశ్వర్యాలతో పాటు సకల  శుభాలు కలుగుతాయని భక్తులు నమ్ముతారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.