Dalit families protest the digging of the pond : చెరువుల తవ్వకాన్ని అడ్డుకున్న దళితులు - సిపిఎం పార్టీ నాయకులు
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11-08-2023/640-480-19236927-662-19236927-1691718136863.jpg)
Dalit families protest the digging of the pond: కృష్ణా జిల్లా నందివాడ మండలం అంకన్నగూడెంలో.. అధికారి పార్టీ అండతో కొందరు గ్రామంలో ఇళ్లకు సమీపంలో చెరువులు తవ్వడానికి యత్నించగా దళితులు అడ్డుకున్నారు. నిబంధనలకు వ్యతిరేకంగా జనావాసాల మధ్య చెరువు తవ్వకాన్ని అధికారులు అడ్డుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. చెరువుల తవ్వకాల వల్ల అంకన్నగూడెం గ్రామం మధ్యలో ఉండాల్సిన తాము ఇళ్లను వదిలి ఊరి చివర ఉండాల్సి వస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మళ్లీ కొంత మంది ఇప్పుడు తాము ఉంటున్న కాలనీ పక్కనే చెరువు తవ్వుతున్నారని, ఇప్పుడు ఎక్కడికి వెళ్లాలని ప్రశ్నిస్తున్నారు. అధికారులు స్పందించి తమ గోడు పట్టించుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు. జనావాసాల మధ్య చెరువుల తవ్వకం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అన్నారు. కేవలం అధికార పార్టీ నేతల స్వార్థానికి, పేద కుటుంబాలు బలి కావాల్సి వస్తోందని, అధికారులు తక్షణ ఈ విషయంపై స్పందించకుంటే దళిత కుటుంబాల పక్షాన తాము ఉద్యమం చేస్తామని సీపీఎం నాయకులు ఆర్సీపీ రెడ్డి హెచ్చరించారు.