Dalit Bahujan Front Korivi Vinay Kumar Fire on CM Jagan: 'దళిత, గిరిజన విద్యార్థుల పట్ల సీఎం జగన్ కంస మామలా మారారు' - ఏపీ లేటెస్ట్ న్యూస్
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 24, 2023, 12:17 PM IST
Dalit Bahujan Front Korivi Vinay Kumar Fire on CM Jagan: దళిత, గిరిజన విద్యార్థుల పట్ల ముఖ్యమంత్రి జగన్ కంస మామలా మారారని దళిత బహుజన ఫ్రంట్ వ్యవస్థాపకుడు కొరివి వినయ్ కుమార్ వ్యాఖ్యానించారు. బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకం, అంబేడ్కర్ విదేశీ విద్యాదీవెన వంటి 20కి పైగా పథకాల్ని రద్దు చేశారని విశ్లేషించారు. జగన్ ప్రభుత్వం రాచరికాన్ని తలపిస్తోందని.. కేవలం తన మాట వినే వాలంటీర్లతోనే పాలన సాగిస్తున్నారని ఎద్దేవా చేశారు. రివర్స్ గేర్లో వైసీపీ పాలన సాగుతుందంటున్న.. కొరివి వినయ్ కుమార్తో మా ప్రతినిధి ఎస్పీ చంద్రశేఖర్ ముఖాముఖి..
"దళిత, గిరిజన విద్యార్థుల పట్ల సీఎం జగన్ కంస మామలా మారారు. దళితులకు సంబంధించిన 20కి పైగా పథకాలు రద్దు చేశారు. ఏపీలో జగన్ ప్రభుత్వం రాచరికాన్ని తలపిస్తోంది. జగన్ తన మాట వినే వాలంటీర్లతోనే పాలన చేస్తున్నారు. రివర్స్ గేర్లో వైసీపీ పాలన సాగుతోంది" - వినయ్ కుమార్, దళిత బహుజన ఫ్రంట్ వ్యవస్థాపకుడు