Cyber Fraud With Fake Fingerprints: నకిలీ వేలిముద్రలతో రూ.6 కోట్లు కాజేసిన ముఠా అరెస్టు

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 16, 2023, 4:02 PM IST

Cyber Fraud With Fake Fingerprints : నకిలీ వేలిముద్రలు, ఆధార్ కార్డులు సృష్టించి ప్రజల బ్యాంకు ఖాతాల నుంచి కోట్ల రూపాయలను కాజేసిన ఐదుగురు అంతరాష్ట్ర ముఠా సభ్యులను వైఎస్సార్ జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. ఈ సైబర్ నేరగాళ్లు 5 ప్రముఖ బ్యాంకులకు సంబంధించిన 12 ఖాతాల నుంచి దాదాపు 6 కోట్ల రూపాయలు కాజేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. గుంటూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన ఐదుగురు (Fake Fingerprints scam) సైబర్ నేరగాళ్లపై 416 పిటిషన్లు ఎన్సీఆర్బీ పోర్టల్​లో నమోదు అయ్యాయని జిల్లా ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 416 మంది బాధితులు ఉంటే వైఎస్సార్ జిల్లా నుంచి 60 మంది ఉన్నట్లు ఎస్పీ వెల్లడించారు. ఆధార్ కార్డుకు అనుసంధానంగా ఉన్న వేలిముద్రలను.. నిందితులు ఓ యంత్రం ద్వారా నకిలీ వేలిముద్రలు తయారు చేసి ప్రజలను మోసం చేస్తున్నట్లు గుర్తించామని ఆయన పేర్కొన్నారు. నిందితులు కాజేసిన 6 కోట్ల రూపాయల బ్యాంకు లావాదేవీలకు సంబంధించిన వివరాలను ఈడీ, ఐటీ సంస్థలకు అందజేస్తామని తెలిపారు. బ్యాంకు ఖాతాల నుంచి వారికి తెలియకుండానే నగదు మాయమవుతున్నట్లు అనుమానం వస్తే పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.