నష్టపోయిన రైతులను అన్ని విధాలా ఆదుకుంటాం: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి - Govt Chief Secretary Jawahar Reddy comments
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 9, 2023, 10:08 PM IST
CS Jawahar Reddy Visit in Konaseema District: మిగ్‌జాం తుపాను ప్రభావంతో పంటలు నష్టపోయిన రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి అన్నారు. తుపాను కారణంగా దెబ్బతిన్న పంటలను ఆయన పరిశీలించారు. అనంతరం పంట నష్టాల గురించి రైతులను అడిగి తెలుసుకున్నారు.
CS Inspected by Damaged Crop Fields: ఆంధ్రప్రదేశ్‌లో మిగ్‌జాం తుపాను కారణంగా వేలాది ఎకరాల్లో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. దాంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ప్రభుత్వం, ఉన్నతాధికారులు స్పందించి పరిహారం చెల్లించాలని రైతులు విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో పర్యటించారు. పర్యటనలో భాగంగా ఆయన వాడపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని దర్శించుకుని ఆత్రేయపురం మండలానికి చెందిన మెర్లపాలెం, లోల్ల గ్రామాల్లోని పంట పొలాలను పరిశీలించారు. అనంతరం రైతులతో మాట్లాడి, పంట నష్టాల గురించి అడిగి తెలుసుకున్నారు. పంటలు నష్టపోయిన రైతుల వివరాలు నమోదు చేసుకున్న ఆయన పంట పొలాలు మునిగిపోవడానికి కారణమైన గోరింకల డ్రైన్‌ను పరిశీలించారు. రైతులను అన్ని విధాల ఆదుకుంటామని, పంటలు నష్టపోయిన వారికి పరిహారం చెల్లించేలా చర్యలు తీసుకుంటామని ఆయన భరోసానిచ్చారు.