ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల సన్నద్ధతపై సీఎస్ జవహర్ రెడ్డి సమీక్ష - andhra pradesh
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 4, 2024, 9:10 PM IST
CS Jawahar Reddy Review Meeting on Elections: ఏపీలో సార్వత్రిక ఎన్నికల సన్నద్ధతపై రాష్ట్ర సచివాలయంలో సీఎస్ కేఎస్ జవహర్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా, ఆర్ధిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్, రాష్ట్ర పన్నుల చీఫ్ కమిషనర్ గిరిజా శంకర్ సహా వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఏపీలో పోలింగ్ కేంద్రాల నిర్వహణ, ఎన్నికల సమయంలో అక్రమ మద్యం, నగదు, ఉచితాలు, వస్తు రవాణా, అంతర్రాష్ట్ర చెక్ పోస్టులు, శాంతిభద్రతల పరిస్థితులు తదితర అంశాలపై సీఎస్ సమీక్షించారు.
మరోవైపు ఈ నెల 9, 10వ తేదీల్లో కేంద్ర ఎన్నికల చీఫ్ కమిషనర్ రాజీవ్ కుమార్ సహా ఎన్నికల కమిషనర్లు కూడా రానుండటంతో ఏర్పాట్లకు సంబంధించిన అంశాలపైనా సీఎస్ అధికారులతో చర్చించారు. 2024 ఓటర్ల జాబితా రూపకల్పన, ఓటర్ల జాబితాలో మార్పులు, అవకతవకల అంశం, ఈవీఎంల ఫస్ట్‌లెవల్ చెక్‌పై కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు సమీక్షించనున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణతో సంబంధం ఉన్న అధికారుల బదిలీలపై కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.