Cricket Betting Gang Arrested in Visakhapatnam: క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు.. 350 కోట్ల రూపాయల లావాదేవీలు గుర్తింపు - cricket betting apps frauds
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 29, 2023, 6:17 PM IST
Cricket Betting Gang Arrested in Visakhapatnam: విశాఖ కేంద్రంగా భారీ క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు అయింది. ఈ కేసులో సుమారు 350 కోట్ల రూపాయల నగదు లావాదేవీలు జరిగినట్లు గుర్తించామని శాంతిభద్రతల డీసీపీ-1 శ్రీనివాసరావు తెలిపారు. విశాఖలోని పోలీస్ కాన్ఫరెన్స్ హాలులో మీడియా సమావేశంలో కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ప్రతి సోమవారం కమిషనర్ నిర్వహించే స్పందనలో (Spandana Program) ఓ బాధితుడు ఫిర్యాదుతో కదిలిన పోలీస్ యంత్రాంగం భారీ రాకెట్‌కు సంబంధించిన 11 మందిని అరెస్టు చేశారు. ఈ కేసులో అనకాపల్లి జిల్లాకి చెందిన సూరి బాబు అనే ప్రధాన బుకీకి నగదు వెళ్తుందని గుర్తించారు. ఈయనతో పాటు దినేష్ అలియాస్ మొను, వాసు దేవరరావులు ప్రధాన బుకీలుగా గుర్తించామన్నారు. 11 ఆన్లైన్ బెట్టింగ్ సైట్లను, యాప్‌లను, 63 బ్యాంక్ అకౌంట్లను గుర్తించామని తెలిపారు. ఫిర్యాదు చేసిన బాధితుడు 8 లక్షల రూపాయల నగదు పోగొట్టుకున్నాడన్నారు. ఇప్పటికే వివిధ బ్యాంకు ఖాతాల్లో ఉన్న 75 లక్షల నగదును ఫ్రీజ్ చేశామన్నారు.