CPI Ramakrishna Fires on Jagan about Polavaram: 'జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం పోలవరం ప్రాజెక్టు పూర్తి కాదు' - CPI Ramakrishna comments on Jagan
🎬 Watch Now: Feature Video
CPI Ramakrishna Fires on Jagan about Polavaram: జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా పోలవరం పూర్తి కాదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో సీఎం జగన్మోహన్ రెడ్డిపై రామకృష్ణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు అని సీఎం జగన్కు ఇప్పుడు గుర్తుకు వచ్చిందా అంటూ ప్రశ్నించారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు అంటూ గడువులు పెంచుకుంటూ పోయిన జగన్.. ఇప్పుడు 2025కు పూర్తి చేస్తాం అంటున్నారని విమర్శించారు. 2025 నాటికి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండరని.. ప్రజలే ఇంటికి పంపిస్తారన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు రూ. 10 లక్షలు ఇస్తానన్న జగన్ ఏదీ ఇవ్వకపోగా.. నిర్వాసితులను నీళ్లలో ముంచి ఈరోజు మాట మారుస్తున్నారన్నారు. జగన్మోహన్ రెడ్డి పోలవరం ఎత్తు ఎందుకు తగ్గిస్తున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అమరావతిని ధ్వంసం చేసినట్లే పోలవరంను నాశనం చేస్తున్నారని ఆరోపించారు. ఈ నెల 23వ తేదీన ఏలూరులో పోలవరం ప్రాజెక్టుపై ప్రత్యేక కార్యాచరణ చేపడుతున్నట్లు రామకృష్ణ తెలిపారు.