CPI Ramakrishna Fires on CM Jagan: సీఎం జగన్‌కి కోర్టులంటే గౌరవం లేదు.. ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఇంటికి పోవడం ఖాయం : రామకృష్ణ - ఏపీ రాజధాని మార్పు గురించి సీఎం జగన్ కామెంట్స్
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/17-10-2023/640-480-19789422-thumbnail-16x9-cpi-ramakrishna-fires-on-cm-jagan.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 17, 2023, 4:49 PM IST
CPI Ramakrishna Fires on CM Jagan: సీఎం జగన్ మోహన్ రెడ్డికి కోర్టులంటే ఏమాత్రం గౌరవం లేనందునే విశాఖ నగరం నుంచి పాలన సాగిస్తానని ప్రజలను మోసం చేస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు. అనంతపురంలో వ్యవసాయ కూలీలు, రైతుల రాష్ట్ర సదస్సుకు వచ్చిన రామకృష్ణ.. జగన్ మోహన్ రెడ్డి పాలన తీరును తప్పుబట్టారు. మూడు రాజధానుల అంశంపై సుప్రీం కోర్టులో కేసు జరుగుతుండగానే, విశాఖ నుంచి పాలన సాగిస్తానని ప్రకటనలు చేయటంతో జగన్‌కి కోర్టులపై గౌరవం లేని వ్యవహారం స్పష్టమైందన్నారు. విశాఖ ఉక్కుమీద మాట్లాడలేరు, రైల్వే జోన్ తీసుకురాలేరు.. అటువంటి జగన్ రాజధాని మార్చుతానని చెప్పటం ప్రజలను మరోసారి మోసం చేయటమేనని రామకృష్ణ విమర్శించారు.
కోర్టులో తీర్పు వ్యతిరేకంగా వస్తుందని ముందుగానే గుర్తించిన జగన్.. విశాఖ నుంచి పాలన చేస్తామనే కొత్త డ్రామాకు తెరలేపారని రామకృష్ణ అన్నారు. డిసెంబర్లో ఎన్నికలకు వెళతారని చెబుతున్నారని.. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా జగన్ ఇంటికి పోవటం ఖాయమని ఆయన చెప్పారు. తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటకే రాని జగన్.. ప్రజలను, ప్రజాసంఘాలను, ప్రతిపక్ష పార్టీ నాయకులను ఇంటికే రానీయరు, ఆయన కార్యాలయానికి రారని మండిపడ్డారు. ప్రజలకు, ప్రతిపక్షాలకు దూరంగా ఉండే సీఎం జగన్.. తాడేపల్లిలో ఉన్నా, విశాఖలో ఉన్నా ఒక్కటేనని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.