CPI Ramakrishna Comments on Jagan అనుమతి తీసుకున్న సభలకు వెళ్ళొద్దని పోలీసులే నోటీసులిస్తే ఎలా? హక్కులకు ప్రభుత్వమే పాతరేస్తోంది: రామకృష్ణ - AP Latest News
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 25, 2023, 5:59 PM IST
|Updated : Sep 25, 2023, 10:18 PM IST
CPI Ramakrishna Comments on Jagan: రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ప్రజాస్వామిక హక్కులకు పాతరేస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మండిపడ్డారు. తమ సమస్యల పరిష్కారానికై అంగన్వాడీలు శాంతియుతంగా చేపట్టిన నిరసనలను అడ్డుకుని అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. విజయవాడ దాసరి భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో రామకృష్ణ మాట్లాడుతూ.. అసెంబ్లీ సమావేశాలు జరిగేటప్పుడు హక్కుల కోసం నిరసనలు చేయడం ప్రజాస్వామ్యంలో సహజం అన్నారు. పోలీస్ అనుమతి తీసుకుని సమావేశం నిర్వహించుకుంటున్న, రైతు మహా సభలకు వెళ్లకూడదని, పోలీసులే నోటీసులు ఇవ్వడం ఇంతవరకు చూడలేదన్నారు. ఈ ప్రభుత్వానికి పిచ్చి పరాకాష్టకు చేరిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపై జగన్ రెడ్డి తన పేరును పిచ్చి రెడ్డి అని పెట్టుకుంటే బాగుంటుందని ఎద్దేవా చేశారు. ఐటీ ఉద్యోగులు శాంతియుతంగా రాజమండ్రికి వెళ్తుంటే అడ్డుకోవడం దుర్మార్గమైన చర్య అని ఆయన అన్నారు. అసెంబ్లీలో పిచ్చి రెడ్డి అధికారంలో ఉండగా.. ఎటువంటి నిరసనలు, సభలు, సమావేశాలు జరుపుకోకూడదు అని చట్టం చేయ్యాలని రామకృష్ణ సూచించారు. ఈ దుర్మార్గపు చర్యలను రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్తామన్నారు. నియంత పోకడలను అడ్డుకోవడానికి ప్రతి ఒక్కరు ఐక్య ఉద్యమానికి కదలి రావాలని ఆయన పిలుపునిచ్చారు.