CPI Narayana Comments on Election Alliances: 'పొత్తుల విషయంలో టీడీపీ ఊగిసలాట వీడాలి.. ఏపీలో వైసీపీ, బీజేపీ కలిసే ఉన్నాయి' - ఏపీలో రాజకీయ పార్టీల పొత్తులు
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 30, 2023, 1:57 PM IST
CPI Narayana Comments on Election Alliances: పొత్తుల విషయంలో తెలుగుదేశం ఊగిసలాట వీడాలని.. సీపీఐ సీనియర్ నేత నారాయణ సూచించారు. ఏపీలో వైసీపీ, బీజేపీ కలిసే ఉన్నాయన్నారు. ఇప్పటికైనా తెలుగుదేశం మేల్కొని.. ఆ రెండు పార్టీలకు వ్యతిరేకంగా కొత్త కూటమి ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు. టీడీపీ బయటకు వచ్చి సీపీఐ, సీపీఎం లేదా పవన్ కల్యాణ్‌తో అయినా పొత్తు పెట్టుకోండి.. అలా చేయకలిగితే వైసీపీ, బీజేపీ రెండు విఫలం అవుతాయి అన్నారు. అలా చేయండం వల్ల మన రాష్ట్రానికి చాలా ఉంపయోగ పడుతుంది.. అంతే కాని మన రాష్ట్రానికి అన్ని రకాల అన్యాయం చేసిన బీజేపీతో పొత్తు పెట్టుకోవడం మంచిది కాదు అని సూచించారు. తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలిలో కొంత మంది నాయకులకు సభ్యులుగా నియమించడంపై నారాయణ పూర్తిగా వ్యతిరేకించారు. సభ్యులుగా ఉన్న వారు మద్యం వ్యాపారాలు చేస్తుంటారు అలాంటి వారికి పాలకమండలిలో చోటు ఇవ్వడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.