ప్రభుత్వ ఆసుపత్రిలో మాక్ డ్రిల్..నాలుగు కేసులు నమోదైనట్లు వైద్యాధికారి వెల్లడి - నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో కొవిడ్ మాక్ డ్రిల్
🎬 Watch Now: Feature Video
గత కొన్ని రోజులుగా మళ్లీ కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులల్లో మాక్ డ్రిల్‌ను ఏర్పాటు చేశారు. కోవిడ్ 4వ దశ నేపథ్యంలో నెల్లూరు జిల్లాలో ఇప్పటికే నాలుగు కోవిడ్ కేసులను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు గుర్తించారు. జీజీహెచ్ లో ప్రత్యేక కోవిడ్ కేంద్రం ఏర్పాటు చేశారు. ప్రభుత్వ వైద్యశాలల్లో రోజుకు రెండు వందల మందికి కోవిడ్ పరీక్షలు చేస్తున్నారు. నెల్లూరు జీజీహెచ్ లో ప్రత్యేక కోవిడ్ వార్డను ఏర్పాటు చేశారు. మంగళవారం మాక్ డ్రిల్ కూడా నిర్వహించారు. 20 మంది ప్రత్యేక వైద్య బృందంతో ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం పరిస్థితుల్లో ఆక్సిజన్ కొరత లేదంటున్నారు. జీజీహెచ్ లో ఉన్న జగనన్న ప్రాణ వాయువు ప్లాంట్ గత రెండు నెలలుగా పనిచేయడం లేదని అధికారులు చెబుతున్నారు.
కోటి రూపాయలతో ఏర్పాటు చేసిన రెండు వేల ఎల్‌ఎమ్‌పీ ప్లాంట్ కు విద్యుత్ సప్లైయ్ లేక నిరుపయోగంగా మారిందని అంటున్నారు. నలుగురిలో ఇద్దరు డిశ్చార్జ్ అయిపోయారనీ, భయాపడాల్సిన పని లేదని, ప్రజల్లోకి వెళ్లినప్పుడు జాగ్రత్ర వహించాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్. పెంచలయ్య చెప్పారు.