Construction of Wall Around Rushikonda : నిబంధనలు ఉల్లంఘిస్తూ.. రుషికొండ చుట్టూ ప్రహరీ నిర్మాణం.. - వైజాగ్ తాజా వార్తలు
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 19, 2023, 12:20 PM IST
Construction of Wall Around Rushikonda : విశాఖపట్నంలోని రుషికొండలో వైసీపీ ప్రభుత్వం చేపట్టే నిర్మాణాలపై ఓ వైపు జాతీయ హరిత ట్రిబ్యునల్, మరోవైపు కోర్టు అభ్యంతరాలు చెప్పినా.. ప్రభుత్వం మొండిగా ముందుకుకెళ్తోంది. ఉన్నత స్థాయి కేంద్ర కమిటీ వాస్తవ పరిస్థితిని, పర్యావరణ విధ్వంసానికి సంబంధించిన మదింపులు ఎలా ఉన్నప్పటికీ.. ఆదేశాలు బేఖాతరు చేస్తూ.. జగన్ సర్కార్ పనుల్లో జోరు పెంచింది.
వైసీపీ ప్రభుత్వం ఇప్పటికే భవనాల నిర్మాణాలకు రూ.250 కోట్ల ఖర్చు చేసింది. ఇప్పుడు మరిన్ని నిధులతో అదనపు హంగులు అద్దుతున్నారు. తాజాగా కొండ చుట్టూ ఏడు అడుగుల రక్షణ గోడను కట్టేందుకు టెండర్లను కూడా ఆహ్వానించి.. పనులు చేపట్టడం అనేది వైసీపీ ప్రభుత్వం మొండి వైఖరికి నిదర్శనంగా నిలుస్తోంది. రుషికొండను బోడిగుండు చేస్తూ.. సీఎం, అధికారుల కార్యాలయాలే నిర్మిస్తున్నారన్న విమర్శలకు తాజాగా చేపడతున్న చర్యలు బలం చేకూరస్తున్నాయి. రుషికొండపై జరుగుతున్న నిర్మాణాలు, ప్రస్తుత పరిస్థితుల గురించి మరింత సమాచారం తెలుసుకుందాం..