Constable Suicide in Police Station పోలీస్టేషన్లో ఆత్మహత్య చేసుకున్న కానిస్టేబుల్.. విషయాన్ని గోప్యంగా ఉంచిన పోలీసులు
🎬 Watch Now: Feature Video
Constable Suicide in Police Station విధులు నిర్వహిస్తున్న పోలీస్ స్టేషన్లోనే ఓ కానిస్టేబుల్ ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వైయస్సార్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే కడప అక్కయ్యపల్లికి చెందిన విజయరాముడు చింతకొమ్మదిన్నె పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. విజయరాముడికి 14 ఏళ్ల క్రిందట విజయభాను అనే ముస్లిం మహిళతో ప్రేమ వివాహం జరిగింది. వీరికి అక్షిత్ అనే ఒక కొడుకు ఉన్నాడు. ఇటీవల కాలంలో విజయరాముడు బ్యాంకులో 20 లక్షల రుణం తీసుకొని ఇల్లు కట్టాడు. పైగా తన భార్య బంగారు నగలను ఐదు లక్షల కుదవ పెట్టాడు. గతంలో విజయరాముడు ఒంటిమిట్ట పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నప్పుడు సస్పెండ్‌కు గురయ్యాడు. ఓవైపు ఆర్థిక సమస్యలు మరోవైపు కుటుంబ సమస్యలు తోడయ్యాయి.
ఈ నేపథ్యంలో నిన్న ఉదయం 11 గంటలకు విజయరాముడు విధులు నిర్వహించడానికి స్టేషన్‌కు వెళ్లి.. పని ఎక్కువగా ఉందని ఇంటికి రాలేదు. ఆ మరుసటి రోజు పోలీసులు విజయరాముడు భార్యకు ఫోన్ చేసి మీరు పోలీస్ స్టేషన్‌కు రావాలని సమాచారం ఇచ్చారు. వెంటనే విజయభాను విజయరాముడు తండ్రి రామయ్య కలిసి పోలీస్ స్టేషన్‌కు వెళ్లగా పోలీసులు మీ కొడుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారని చెప్పారు. ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలే మృతికి కారణమని భావిస్తున్నట్లుగా పోలీసులు తెలిపారు. ఈ విషయాన్ని బయటికి రానివ్వకుండా అత్యంత గోప్యంగా ఉంచి శవ పరీక్ష నిర్వహించి మృతదేహాన్ని పోలీసులు ఇంటికి పంపించారు. మృతుడి భార్య విజయభాను కన్నీరు మున్నీరుగా విలపిస్తూ.. తన భర్త ఆత్మహత్యకు కారణాలు తెలియలేదని కాకపోతే ఆర్థికంగా సమస్యలు ఉన్నాయని ఆమె పేర్కొన్నారు.