Condemnation on Chandrababu Naidu Arrest: 'రాజకీయ విద్వేషంతో అరెస్టులా..!' చంద్రబాబు కేసుపై జార్ఖండ్ బీజేపీ, కాంగ్రెస్ నేతలు విస్మయం - Arrest

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 12, 2023, 7:38 PM IST

Condemnation on Chandrababu Naidu arrest : జగన్ ప్రభుత్వం స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌ పేరుతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును అరెస్టు చేయడాన్ని వివిధ రాజకీయ పార్టీల నేతలు ఖండిస్తున్నారు. ఏపీ ప్రభుత్వ చర్యను పార్టీలకతీతంగా ముక్తకంఠంతో ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే బంగాల్ సీఎం మమతా బెనర్జీ, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్.. చంద్రబాబు నాయుడు అరెస్టు (Chandrababu Naidu arrest) పై స్పందించారు. రాజకీయ కక్షతో అరెస్టులకు పాల్పడడం సరికాదని పేర్కొన్నారు. 

తాజాగా... జార్ఖండ్ అసెంబ్లీ మాజీ స్పీకర్, రాంచీకి చెందిన బీజేపీ ఎమ్మెల్యే సీపీ సింగ్.. చంద్రబాబు నాయుడు అరెస్టుపై స్పందించారు. స్కిల్ డెవలప్​మెంట్​ కేసులో దోషులెవరో కోర్టు నిర్ణయిస్తుందని అన్నారు. అధికార పార్టీ ఉద్దేశపూర్వకంగా చంద్రబాబు నాయుడును అరెస్టు చేసిందన్న.. టీడీపీ నేతల ఆరోపణలు వాస్తవమే అనిపిస్తోందని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. జార్ఖండ్‌ కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ (Jharkhand Congress Working President) బంధు టిర్కీ స్పందిస్తూ.. స్కామ్‌ జరిగితే చట్టం తన పని తాను చేసుకుపోతుందని, అయితే రాజకీయ విద్వేషంతో చర్యలు తీసుకోవడం సరికాదని అన్నారు. ఇటీవలి కాలంలో ఈ తరహా ట్రెండ్ ఎక్కువైందని, అందుకే రాజకీయ దురుద్దేశంతో ఎలాంటి చర్యలు తీసుకోకూడదని బంధు టిర్కీ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.