అనంతపురంలో భారీ వర్షం - కొబ్బరి చెట్టుపై పిడుగు పడడంతో ఉలిక్కిపడిన ప్రజలు - anantapuram pidugu news
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 9, 2023, 1:05 PM IST
coconut tree struck by thunder bolt : అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం లత్తవరం గ్రామంలో బుధవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. గ్రామంలో ఓబుళప్ప అనే వ్యక్తి ఇంటి సమీపంలో ఉన్న కొబ్బరి చెట్టుపై ఒక్కసారిగా పిడుగుపడటంతో మంటలు వ్యాపించాయి. మండలంలో బుధవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు ఓ మోస్తారు వర్షపాతం నమోదైంది. సాయంత్రం నుంచి భారీ ఈదురుగాలులు సంభవించాయి. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది.
ఓ పక్క వర్షం పడుతుంటే ఒక్కసారిగా కొబ్బరి చెట్టుపై పిడుగు పడింది. త్వరితగతిన మంటలు చెలరేగాయి. ఆ మంటలను చూసిన ప్రజలు భయాందోళనకు గురయ్యారు. వెంటనే మంటలను చూసిన స్థానికులు అప్రమత్తం కావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ సంఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం కానీ, ఆస్తి నష్టం కానీ సంభవించలేదు. భారీగా వర్షం కురస్తుండటంతో కొబ్బరి చెట్టుపై ఉన్న మంటలు కొద్దిసేపటికి అరిపోయాయి. అక్కడ ఉన్న స్థానికులు అంతా ఊపిరి పీల్చుకున్నారు.