CM Jagan Visit To Visakhapatnam 2023 : సీఎం జగన్, ఉన్నతాధికారుల విశాఖ పర్యటన... వసతి ఏర్పాట్లపై కమిటీ చర్చ - సీఎం జగన్ వైజాగ్ పర్యటన 2023
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 17, 2023, 12:50 PM IST
CM Jagan Visit To Visakhapatnam 2023 : ఉత్తరాంధ్ర అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి, ఉన్నతాధికారులు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా విశాఖపట్నంలో ట్రాన్సిట్ అకామిడేషన్ కొరకు అవసరమైన ఏర్పాట్లపై కమిటీని నియమించారు. ఈ సభ్యులు వీఎంఆర్డీఏ కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ కార్యక్రమం స్పెషల్ చీఫ్ సెక్రటరీ వై. శ్రీలక్ష్మి అధ్యక్షతన నిర్వహించారు. కమిటీ సభ్యులుగా స్పెషల్ సీఎస్ ఫైనాన్స్ ఎస్ఎస్ రావత్, సెక్రటరీ పోలా భాస్కర్ వ్యవరించారు. వివిధ శాఖల కార్యాలయాల్లో వసతి సౌకర్యాలు సంబంధిత అంశాల పై వీరు చర్చించారు.
CM Jagan Visit To Visakhapatnam 2023 : సీఎం జగన్ విశాఖ పర్యటన... శరవేగంగా ఏర్పాట్లు.. సీఎం పర్యటనలో ఎటువంటి లోటుపాట్లు జరగకుండా ప్రణాళిక ప్రకారం నిర్ణయాలు చేపట్టారు. వసతి సంబంధిత పనులు త్వరగా జరిగేలా పర్యవేక్షించేందు ఈ కమిటీ చర్యలు చేపట్టింది. జిల్లా కలెక్టర్ డా.ఏ. మల్లికార్జున, జీవీఎంసీ కమిషనర్ సాయికాంత్ వర్మ, జాయింట్ కలెక్టర్ కేఎస్. విశ్వనాథన్ సహా పలువురు అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.