CM Jagan Tweet on Samajika Sadhikara Bus Yatra: వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్రపై సీఎం జగన్ ట్విట్ - ycp Samajika Sadhikara Bus Yatra news
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/26-10-2023/640-480-19865515-thumbnail-16x9-cm.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 26, 2023, 9:20 PM IST
CM Jagan Tweet on Samajika Sadhikara Bus Yatra: రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్సీపీ చేపట్టిన ''సామాజిక సాధికార బస్సు యాత్ర''పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. సామాజిక మాధ్యమాల వేదికగా స్పందించారు. తమ ప్రభుత్వంలో జరిగిన సామాజిక న్యాయాన్ని ప్రతిధ్వనించాలని, పేదవాడి విజయానికి బాటలు వేయాలని పేర్కొన్నారు. వైసీపీ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు కల్పించిన ప్రాధాన్యత.. ఈ దేశ, రాష్ట్ర చరిత్రలోనే ఎవరూ చేయలేదని ట్విటర్ (ఎక్స్)లో పోస్ట్ చేశారు.
CM Jagan Tweet Details: ''మన ప్రభుత్వంలో నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీలకు కల్పించిన ప్రాధాన్యత ఈ రాష్ట్ర చరిత్రలోనే కాదు, దేశ చరిత్రలో కూడా మునుపెన్నడూ చూడనిది. ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో ప్రగతిని ఒక హక్కుగా మన ప్రభుత్వం వారికి అందించింది. 53 నెలల కాలంలో రూ. 2.38 లక్షల కోట్ల డీబీటీలో 75శాతం ఈ వర్గాలకు చేరడమే దీనికి నిదర్శనం. చట్టం చేసి నామినేటెడ్ పదవుల్లో 50శాతం ఈ వర్గాలకు ఇస్తూ పట్టం కట్టిన ప్రభుత్వం కూడా మనదే. పెత్తందారీ పోకడలున్న వ్యక్తులు, శక్తులు అడుగడుగునా అడ్డుపడ్డా ఎక్కడా వెనకడుగు వేయలేదు. రాబోయే రోజుల్లోకూడా పెత్తందారులకు, పేదలకు మధ్య యుద్ధం జరగబోతోంది. ఈరోజు నుంచి వైసీపీ చేపట్టిన ''సామాజిక సాధికార యాత్ర'' ద్వారా వీరంతా ఏకమై మన ప్రభుత్వంలో జరిగిన సామాజిక న్యాయాన్ని ప్రతిధ్వనించాలి. పేదవాడి విజయానికి బాటలు వేయాలి.'' అని జగన్ ట్విట్‌లో పేర్కొన్నారు.