జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని సుప్రీంలో రఘురామ పిటిషన్ - జగన్ పై ఎంపీ రఘురామకృష్ణరాజు ఆరోపణలు
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 1, 2023, 7:42 PM IST
CM Jagan Mohan Reddy Illegal Assets Case Investigation: వైసీపీ ప్రభుత్వంపై ఎంపీ రఘురామ కృష్ణరాజు మరోసారి దృష్టి సారించారు. ఇంతకాలం నిశ్శబ్ధంగా ఉన్నఆయన వైసీపీ ప్రభుత్వాన్ని ఉక్కిరి బిక్కిరి చేసే పనిలో పడ్డారు. సీఎం జగన్ అక్రమ ఆస్తుల కేసుల విచారణను తెలంగాణ రాష్ట్రం (Telangana State) నుంచి మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని ఎంపీ రఘురామ కృష్ణరాజు సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ శుక్రవారం విచారణకు రానుంది. రఘురామ కృష్ణరాజు పిటిషన్పై జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ భట్టి ధర్మాసనం విచారణ జరపనుంది. జగన్ అక్రమ ఆస్తుల కేసులపై తెలంగాణ సీబీఐ (CBI) కోర్టులో జాప్యం జరుగుతోందని తన పిటిషన్‌లో పేర్కొన్నారు. సీబీఐ కోర్టు ఇప్పటికే 3071 సార్లు కోర్టు వాయిదా వేసిందని పిటిషన్‌లో రఘురామ వెల్లడించారు. జగన్ ప్రత్యక్ష హాజరుకు కూడా సీబీఐ కోర్టు మినహాయింపు ఇచ్చిందన్నారు. వందల కొద్దీ డిశ్చార్జ్ పిటిషన్లతో కేసు విచారణ ఆలస్యమయ్యే అవకాశం ఉందన్నారు.