Jagan Gudiwada Tour: రేపు గుడివాడలో జగన్ పర్యటన.. టిడ్కో ఇళ్లు ప్రారంభం - టిడ్కో ఇళ్లు ప్రారంభం
🎬 Watch Now: Feature Video

CM Jagan Gudiwada Tour: రేపు కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన పర్యటనకు సంబంధించి షెడ్యూల్ విడుదల అయ్యింది. రేపు ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి.. హెలికాఫ్టర్లో బయలుదేరి 9.35 కు మల్లాయపాలెం హెలీప్యాడ్‌కు చేరుకుంటారు. ఆ తర్వాత 9.50 గంటలకు హెలీప్యాడ్ నుంచి టిడ్కో కాలనీకి వస్తారు. 10.10 గంటలకు టిడ్కో ఇళ్లను సందర్శిస్తారు. 10.20 గంటలకు కాలనీలో ఏర్పాటు చేసిన వైఎస్ రాజశేఖర్రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం సభా వేదిక వద్దకు చేరుకుంటారు. 10.25 గంటలకు లబ్దిదారులకు రిజిస్ట్రేషను పత్రాల పంపిణీ, ఫొటో సెషన్ ఉంటుంది. 11.05 గంటలకు లబ్ధిదారులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. 11.50 సభ ముగి స్తారు. మధ్యాహ్నం 12 గంటలకు స్థానిక ప్రజా ప్రతినిధులతో మాట్లాడతారు. 12.35 హెలికాఫ్టర్ ద్వారా తాడేపల్లికి తిరుగు ప్రయాణమవుతారు. ముఖ్యమంత్రి జగన్ పర్యటన దృష్ట్యా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.