ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో సీఎం జగన్ పుట్టినరోజు వేడుకలు - కేక్ కట్ చేసిన అధ్యాపకులు - cm ys jagan birthday celebrations
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 21, 2023, 6:55 PM IST
CM Jagan Birthday Celebrations in ANU: రాష్ట్రంలో గత కొన్ని సంవత్సరాలుగా పలు వర్సిటీలు రాజకీయాలకు కేంద్రాలుగా మారుతున్నాయి. అవకాశం దొరికినప్పుడల్లా అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది వైసీపీకి తమ స్వామి భక్తిని చూపిస్తున్నారు. సీఎం జగన్ భజన చేయడంలో ఆ పార్టీ కార్యకర్తలను మించిపోతున్నారు. తాజాగా గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఆచార్యులు సైతం తామేం తక్కువ కాదంటూ మరోసారి నిరూపించారు. గుంటూరు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో సీఎం జగన్ పుట్టినరోజు వేడుకలు జరుపుకొన్నారు.
సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా విశ్వవిద్యాలయంలోని వైఎస్ విగ్రహం వద్ద భారీ కేక్ కట్ చేశారు. అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు జై జగన్ అంటూ నినాదాలు చేశారు. జగన్ మరోసారి అధికారంలోకి రావాలంటూ అధ్యాపకుల సంఘం అధ్యక్షుడు డాక్టర్ నాగరాజు ఆకాంక్షించారు. జగన్ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన కేక్‌ను రెక్టార్ ఆచార్య వరప్రసాద మూర్తి కట్ చేశారు. అనంతరం ముఖ్యమంత్రికి మద్దతుగా విద్యార్థులు, అధ్యాపకులు నినాదాలు చేశారు.