ఆడుకుంటూ వెళ్లిన బాలుడు అదృశ్యం - డ్రైనేజీలో మృతదేహం - andhra pradesh latest news

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 22, 2023, 8:23 AM IST

 Rajamahendravaram Child Missing Body In Drainage: రాజమహేంద్రవరంలోని ఆవ రోడ్డు వాంబే గృహాల వద్ద రెండు రోజుల క్రితం అదృశ్యమైన బాలుడు స్థానికంగా మురుగు కాలువలో మృతి చెందడం కలకలం రేపింది. ద్వారకా తిరుమల సమీపంలోని సీహెచ్ పోతేపల్లి గ్రామానికి చెందిన ఆకెళ్ల రాజేష్, జగదీశ్వరి దంపతులు ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో నివాసముంటున్నారు. రాజేష్ రోజువారి కూలీ కాగా వీరికి మణికంఠ అనే 5 ఏళ్ల బాలుడు ఉన్నాడు. జగదీశ్వరి మణికంఠతో కలసి ఈ నెల 18న రాజమహేంద్రవరం వారి మేనత్త ఇంటికి వచ్చింది. 

19న ఉదయం మేనత్త ఇంట్లో బాలుడ్ని ఉంచి జగదీశ్వరి నగరంలోని మరో బంధువు ఇంటికి వెళ్లింది. మధ్యాహ్నం తిరిగి వచ్చేసరికి ఇంటి దగ్గర మణికంఠ కనిపించలేదు. చుట్టుపక్కల గాలించిన ఫలితం లేకపోయే సరికి బాలుడు ఆదృశ్యమైనట్లుగా తల్లి పోలీసులుకు ఫిర్యాదు చేశారు. మంగళవారం ఉదయం వాంబే కాలనీ వద్ద స్థానికంగా మురుగుకాలువలో బాలుడు మృతదేహం లభ్యమైంది. బంధువులు, కాలనీ వాసులు ఏళ్ల తరబడి మురుగుకాలువపై మూతలు వేయాలని విన్నవించినా పట్టించుకోలేదని వారు స్పందించలేదని ఆగ్రహంతో ఆందోళన నిర్వహించారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.