స్కిల్ కేసు - చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా - Chandrababu Quash Petition Hearing
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 15, 2023, 10:20 AM IST
|Updated : Nov 15, 2023, 9:18 PM IST
Chandrababu Regular Bail Petition High Court Hearing Postpone : స్కిల్ డెవలప్మెంట్ కేసు (AP Skill Development Case)లో బెయిల్ కోసం తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు దాఖలు చేసిన పిటిషన్‌పై ఈరోజు హైకోర్టులో విచారణ జరిగింది. అదనపు అఫిడవిట్ దాఖలు చేస్తామని సీఐడీ తరఫు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. అందుకు సమయం కావాలంటూ కోరడంతో.. విచారణను మధ్యాహ్నం 2.15 గంటల వాయిదా వేస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. మళ్లీ వాదనలు విన్న అనంతరం చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టు విచారణ రేపటికి వాయిదా వేసింది. సీఐడీ తరఫున ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. చంద్రబాబు కంటి ఆపరేషన్, ఆరోగ్య పరిస్థితి వివరాలను ఆయన తరఫు న్యాయవాదులు హైకోర్టుకు సమర్పించారు. వైద్యుల సూచనల మేరకు నివేదికను మెమో ద్వారా కోర్టుకు అందించారు.
Chandrababu Right Eye Surgery : చంద్రబాబు కుడి కంటికి శస్త్రచికిత్స నిర్వహించినట్లు.. ఆయన కోలుకోవడానికి తప్పనిసరిగా మందులు వాడాలని వైద్యులు సూచించినట్లు కోర్టుకు తెలిపారు. ఐదు వారాల పాటు కంటి చెకప్ కోసం వైద్యులు షెడ్యూల్ ఇచ్చినట్లు చెప్పారు. కంటికి 5 వారాల పాటు ఇన్‌ట్రా ఆక్యులర్ ప్రెజర్ చెక్ చేసుకోవాల్సి ఉంటుందన్నారు. 5 వారాల పాటు కంట్లో చుక్కల మందులు వేసుకోవాలని.. చంద్రబాబు గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్నారని కోర్టుకు వివరించారు. గుండె పరిమాణం పెరిగింది. గుండెకు రక్తం సరఫరా చేసే రక్తనాళాల్లో సమస్యలున్నాయి. మధుమేహం అదుపులో ఉంది.. జాగ్రత్తలు పాటించాలి. ఆయనకు తగినంత విశ్రాంతి అవసరం" అని వైద్యులు సూచించిన నివేదికను కోర్టుకు అందించారు.
CID Notice to Telugu Desam Party Office : తెలుగుదేశం పార్టీ బ్యాంక్ ఖాతాలో జమ చేసిన కొంత నగదుకు సంబంధించిన వివరాలు కోరినట్లు సీఐడీ న్యాయవాది కోర్టుకు తెలిపారు. నోట్ల రద్దు తర్వాత భారీగా వెయ్యి రూపాయల నోట్లు టీడీపీ బ్యాంక్ ఖాతాలో జమ అయ్యాయని సీఐడీ న్యాయవాది తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సంస్థకు చెందిన అధికారి ద్వారా ప్రాజెక్ట్ ధర పెంచారని న్యాయవాది వాదించారు. మరికొన్ని వాదనలు వినిపించేందుకు గురువారం న్యాయస్థానం వాయిదా వేసింది. గురువారం సీఐడి వాదనల తర్వాత.. చంద్రబాబు తరపు న్యాయవాదులు కౌంటర్ వాదనలు వినిపిస్తారు.
Supreme Court Hearing Chandrababu Quash Petition : ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో తనపై నమోదైన కేసును క్వాష్ చేయాలని కోరుతూ టీడీపీ అధినేత చంద్రబాబు వేసిన పిటిషన్‌పై దీపావళి తర్వాత తీర్పు వెలువరించనున్నట్లు సుప్రీంకోర్టు గతంలో తెలిపింది. ఈ కేసులో ఇప్పటికే వాదనలు పూర్తి కావడంతో దీనిపై తీర్పును సుప్రీంకోర్టు రిజర్వ్ చేసింది. చంద్రబాబుపై నమోదైన అన్ని కేసులకు సెక్షన్ 17ఏ వర్తిస్తుందా లేదా అనేదానిపై ఉత్కంఠ నెలకొన్న సమయంలో ఈ తీర్పు చాలా కీలకంగా మారబోతోంది. సుప్రీంకోర్టు క్వాష్ పిటిషన్‌ను ఆమోదిస్తే ఈ కేసుతో పాటు మిగతా కేసుల్లోనూ చంద్రబాబుకు ఊరట లభిస్తుంది.