Chandrababu on CM Jagan in Nandyala టీడీపీ అధికారంలోకి వచ్చాక కరెంట్ ఛార్జీలు పెంచం.. అవసరమైతే తగ్గిస్తాం: చంద్రబాబు - TDP Cheif Chandrababu news
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 8, 2023, 11:02 PM IST
Chandrababu hot comments on CM Jagan in Nandyala Meeting: రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక.. రాయలసీమ ప్రాజెక్టులకు తీవ్ర అన్యాయం జరిగిందని చంద్రబాబు మండిపడ్డారు. రాష్ట్రంలో కరెంట్ ఎప్పుడు వస్తుందో..?, ఎప్పుడో పోతుందో..? తెలియని పరిస్థితి నెలకొందని ధ్వజమెత్తారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక.. కరెంట్ ఛార్జీలను పెంచమని చంద్రబాబు నాయుడు ప్రజలకు హామీ ఇచ్చారు.
CBN COMMENTS: 'బాబు ష్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారెంటీ' కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు నాయుడు శుక్రవారం నంద్యాల జిల్లాలో పర్యటించారు. పర్యటనలో భాగంగా బనగానపల్లిలో మహిళలతో చంద్రబాబు ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం రాజ్ థియేటర్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. ''గుంతల రోడ్ల వల్ల.. ఆటోలకు రిపేర్లే రిపేర్లు. వాహనాలకు అధికంగా జరిమానాలు వేస్తున్నారు. వాహనాలపై గ్రీన్ ట్యాక్స్ సహా భారీగా పన్నులు వేస్తున్నారు. రాష్ట్రంలో ఆటోమొబైల్ పరిశ్రమ కుదేలైంది. నన్ను తిట్టేవారికి మంత్రి పదవులు ఇచ్చారు. మేం తెచ్చిన విమానాశ్రయాన్ని జగన్ మళ్లీ ప్రారంభించారు. నందికొట్కూరులో సీడ్ హబ్ వస్తే ఉపాధి అవకాశాలు పెరిగేవి. ఓర్వకల్లుకు పరిశ్రమలు రప్పించలేకపోయారు. నంద్యాల జిల్లాలోని పరిశ్రమలను జగన్ తరిమికొట్టారు. జిల్లాలో ఒక్క సాగునీటి ప్రాజెక్టూ జగన్ కట్టలేదు. టమాటా ధరలు పడిపోయి రోడ్లపై పారబోస్తున్నారు. రాష్ట్రంలో కరెంట్ ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి. మేం అధికారంలోకి వచ్చాక కరెంట్ ఛార్జీలు పెంచం. అవసరమైతే తగ్గిస్తాం. సీట్లు ముందే ప్రకటించం.. సర్వే చేయిస్తాం. సర్వే చేశాక అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. నేను పోటీచేసే సీటుపై కూడా ముందే నిర్ణయం ఉండదు.'' అని చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు.