Accident in Vizag బైక్​లను ఢీకొట్టి.. ఫుట్​పాత్​ ఎక్కేసి.. చెట్టెక్కిన కారు! విశాఖలో మద్యం మత్తులో వైద్యురాలి డ్రైవింగ్​..!

By

Published : Aug 2, 2023, 10:48 AM IST

thumbnail

Car Accident in Visakhapatnam: విశాఖ నగరంలో మంగళవారం అర్ధరాత్రి ఓ కారు బీభత్సం సృష్టించింది. రామా టాకీస్‌ వైపు నుంచి సిరిపురం వైపు వెళ్తున్న ఈ కారు వి.ఐ.పి. రోడ్డులోని ప్యారడైజ్‌ హోటల్‌ సమీపంలో పార్కింగ్‌ చేసి ఉన్న ఏడు ద్వి చక్ర వాహనాలను ఢీకొని అనంతరం డివైడర్‌ ఫుట్‌పాత్‌ ఎక్కేసింది. అక్కడున్న ఓ చెట్టును ఢీకొని ఆగిపోయింది. ఈ ప్రమాదంలో కారు, ద్విచక్ర వాహనాలు బాగా ధ్వంసం అయ్యాయి. ఆ సమయంలో కారు డ్రైవింగ్‌ చేస్తున్నది ఓ వైద్యురాలని, ఆమె మద్యం మత్తులో ఉన్నారని సమాచారం. ప్రమాదం జరిగిన తర్వాత ఆమె మరో కారులో అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు స్థానికులు చెప్తున్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా ధ్వంసమైన ద్విచక్రవాహనాలను కూడా పోలీసులు పరిశీలించారు. బాధ్యతాయుతమైన వృత్తిలో ఉండి మద్యం మత్తులో ర్యాష్​ డ్రైవింగ్​ చేయడం పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.