Capital Farmers Protest Against CM Jagan: రాజధాని రైతుల నుంచి సీఎంకు నిరసన సెగ.. జగన్‌కు వ్యతిరేకంగా నినాదాలు... - జగన్‌కు వ్యతిరేకంగా నినాదాలు
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 27, 2023, 5:09 PM IST
Capital Farmers Protest Against CM Jagan: రాజధాని అమరావతిపై కక్ష సాధింపు చర్యలను మానుకోవాలంటూ.. మహిళలు, రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇవాళ ఉదయం అసెంబ్లీకి వెళ్తున్న సీఎం జగన్‌కు రాజధాని Capital) రైతులు నుంచి మరోసారి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. శాసనసభ సమావేశాల్లో పాల్గొనేందుకు వెళ్తున్న సీఎం జగన్ (CM Jagan) వ్యతిరేకంగా రైతులు, మహిళలు ఆందోళన కార్యక్రమాలు కొనసాగించారు. పెద్దఎత్తున రోడ్లకు ఇరువైపుల చేరుకోవడంతో.. వారిని పోలీసులు అదుపుచేసే ప్రయత్నం చేశారు. రైతుల దీక్షా శిభిరం ముందు నిలబడి సేవ్ ఆంధ్రప్రదేశ్ సేవ్ అమరావతి (Amaravati) అనే ప్లకార్డులు ప్రదర్శించారు. ముఖ్యమంత్రి వాహన శ్రేణి మందడం శిబిరం వద్దకు రాగానే... రాజధాని (Amaravati)కి చెందిన మహిళలు, రైతులు బయటకు వచ్చి జగన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీఎం డౌన్ డౌన్ అంటూ నల్లజెండాలు ప్రదర్శించారు. చంద్రబాబుకు మద్దతుగా దీక్ష శిబిరం వద్ద నిరసన తెలుపుతున్న వృద్ధుడిని పోలీసులు అడ్డుకున్నారు. సీఎం వచ్చే సమయమైందని లోపలికి వెళ్లాలని సూచించారు. పోలీసులు ఎంత చెప్పినా... ఆ రైతు వినకుండా చంద్రబాబుకు తన మద్దతు అంటూ ప్లకార్డు ప్రదర్శించారు.