కుమార్తె శరీర అవయవాలు దానం చేసిన తల్లిదండ్రులు - బ్రెయిన్‌డెడ్ కావడంతో - బ్రెయిన్ డెడ్ అయిన కుమార్తె అవయవాలు దానం
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 26, 2023, 11:03 PM IST
Brain Dead Woman Donated Organs in Srikakulam: రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలైన కుమార్తె శరీర అవయవాలను దానం చేసి.. తల్లిదండ్రులు గొప్ప మనసు చాటుకున్నారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం కొత్తపేటకు చెందిన 23 ఏళ్ల మౌనిక శరీర అవయవాలను.. తల్లిదండ్రులు దానం చేశారు. శ్రీకాకుళంలో నాలుగు రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో మౌనిక తలకు తీవ్ర గాయాలయ్యాయి. శ్రీకాకుళం, విశాఖలోని పలు ఆస్పత్రులకు తరలించినా.. ఫలితం లేకపోయింది. వైద్య పరీక్షలు నిర్వహించగా బ్రెయిన్‌డెడ్ అయ్యిందని వైద్యులు తెలిపారు.
దీంతో ఆమె తల్లిదండ్రులు.. మౌనిక శరీర అవయవాలను దానం చేసేందుకు ముందుకొచ్చారు. బ్రెయిన్ డెడ్ అయిన మౌనిక అవయవాలను.. తరలించే ప్రక్రియను.. రాగోలులోని జెమ్స్ ఆసుపత్రి వైద్యులు చేపట్టారు. మౌనిక అవయవాల్లో.. గుండెను తిరుపతి స్విమ్స్ ఆసుపత్రికి తరలించగా.. ఒక మూత్రపిండాన్ని విశాఖకు పంపారు. జెమ్స్ ఆసుపత్రిలోనే మరో మూత్రపిండాన్ని ఉంచారు. రెడ్‌క్రాస్ నిర్వాహకులకు రెండు కళ్లు అప్పగించారు. గ్రీన్ చానల్ ద్వారా అవయవాలను తరలించినట్లు వైద్యులు తెలిపారు. తాము అనుభవిస్తున్న వ్యథను మరెవరూ పడకూడదనే.. ఈ నిర్ణయం తీసుకున్నామంటూ మౌనిక తల్లి భావోద్వేగానికి గురయ్యారు.