Brahma Kumaris Protest Against CBN Arrest: చంద్రబాబుకు మద్దతుగా బ్రహ్మకుమారీలు.. 'మేము సైతం బాబు కోసం' అంటూ సంతకాలు - చంద్రబాబుకు మద్దతుగా 7వ తరగతి చిన్నారి

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 21, 2023, 9:37 AM IST

Brahma Kumaris Protest Against CBN Arrest: 'మేము సైతం బాబు కోసం'.. అంటూ బ్రహ్మకుమారీలు రాజమహేంద్రవరంలో మద్దతు తెలిపారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ బస కేంద్రం వద్ద అధినేత చంద్రబాబుకు మద్దతుగా బ్రహ్మకుమారీలు సంతకాలు చేశారు. చంద్రబాబుకు ప్రజల అండతో పాటు దేవుడి అండ ఉందని బ్రహ్మకుమారీలు తెలిపారు. చంద్రబాబు త్వరలోనే జైలు నుంచి బయటకు వస్తారని బ్రహ్మకుమారీలు ఆకాంక్షించారు.

చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంగళగిరి మండలం కురగల్లుకు చెందిన ఏడో తరగతి విద్యార్థి రావూరి మహేశ్​ బాబు చంద్రబాబు అరెస్టు అక్రమమని ఆరోపించాడు. అధికారం ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తే జగన్​కి తగిన గుణపాఠం చెప్పేందుకు తెలుగుదేశం పార్టీ.. రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆ చిన్నారి ప్రభుత్వాన్ని హెచ్చరించాడు. చంద్రబాబు నిర్దోషి అని ప్రపంచం మొత్తం విశ్వసిస్తున్నా.. జగన్ ఎందుకు నమ్మటం లేదని మండిపడ్డాడు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.