Somu Veerraju Interview: 'అవధూత భూములు లీజుకిస్తే ఊరుకోం.. అన్యాక్రాంతం చేస్తే సహించం'
🎬 Watch Now: Feature Video
Somu Veerraju Interview: హిందువుల స్థలాలపై వైసీపీ నేతలు కన్నేశారని.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆరోపించారు. విజయవాడ పటమటలంకలోని అవధూత, తపోవన్, ఆరోగ్య సదన్ ట్రస్టు భూములను.. పార్టీ నేతలతో కలిసి సోము వీర్రాజు పరిశీలించారు. దేవదాయ కమిషనర్‌తో ఫోన్‌లో మాట్లాడి.. ప్రభుత్వ చర్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ట్రస్ట్ భూములను అన్యాక్రాంతం చేసే విధంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. అవధూత భూములను లీజుకు ఇస్తే ఊరుకోబోమన్నారు. ట్రస్ట్ భూములను అన్యాక్రాంతం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. కేంద్రం ఆయుష్ డిపార్ట్మెంట్కి నిధులు మంజూరు చేస్తుంటే ఇక్కడ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, హిందువుల స్థలాలు ఆక్రమించుకుంటుందని మండిపడ్డారు. మతమార్పిడులు చెయ్యడానికి స్థలాలు లీజుకి ఇస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్య.. హిందూత్వ వ్యతిరేక ధోరణిని సోము వీర్రాజు వ్యతిరేకించారు. ప్రస్తుతం దేవాదాయ శాఖ ఆధీనంలో అవధూత ట్రస్ట్ స్థలం ఉందని.. దీన్ని లీజుకు ఇచ్చే ఆలోచనలో దేవాదాయ శాఖ ఉందని అన్నారు. ఏపీలో ఆయుర్వేద కళాశాల లేదు. యునాని ఊసే లేదని విమర్శించారు. ఈ స్థలాన్ని లీజుకు ఇవ్వటానికి బీజేపీ వ్యతిరేకిస్తోందని తెలిపారు. అవధూత భూముల్లో ప్రకృతి వైద్యశాల ఏర్పాటు చేయాలంటున్న సోము వీర్రాజుతో మా ప్రతినిథి శ్రీనివాస్ మోహన్ ముఖాముఖి.