కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌కి బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి లంకా ఫిర్యాదు
🎬 Watch Now: Feature Video
BJP Representative Lanka Dinkar Complained to Union Finance Minister: ఆర్థిక నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వాలు ఎఫ్ఆర్బీఎమ్ (Finance Responsibility Budget Management) నిబంధనలను అతిక్రమిస్తున్నాయని బీజేపీ(BJP) ముఖ్య అధికార ప్రతినిధి లంక దినకర్ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్‌కు ఫిర్యాదు చేశారు. విజయవాడలో మంత్రి నిర్మల సీతారామన్‌ను లంకా దినకర్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఆర్టికల్ 293(3), 293(4) నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వాలు ఉల్లంఘిస్తున్నాయని లంక దినకర్ తెలిపారు. ఏపీ, పంజాబ్, కేరళ వంటి రాష్ట్రాలు చేస్తున్న ఆఫ్ బడ్జెట్ రుణాలపై జాతీయ నియంత్రణ మండలి ఏర్పాటు చేయాలని కోరారు.
State Governments Violating FRBM Norms: ఆంధ్రప్రదేశ్, పంజాబ్, కేరళ రాష్ట్రాలు పరిమితికి మించి చేస్తున్న రుణాలపై ఆంక్షలు విధించినట్టు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌కు తెలిపానని దినకర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మార్కెట్ రుణాల సేకరణ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన ప్రకటనలను నిలిపివేశారని అన్నారు. ప్రధాని మోదీ అమలుచేస్తున్న “ వికసిత భారత్ “ సంకల్పం సిద్ధించాలంటే రాష్ట్రాల ఆర్థిక నిర్వహణ, మూలధనం, సంక్షేమ వ్యయం సక్రమంగా జరగాలని తెలిపారన్నారు.