నాలుగేళ్లలో 8సార్లు విద్యుత్ ఛార్జీల పెంపు - పేదల నడ్డి విరుస్తున్న జగన్ ప్రభుత్వం : బీజేపీ - update news tirupati district
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/21-12-2023/640-480-20323896-thumbnail-16x9-bjp-protest-electricity-chargers.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 21, 2023, 5:45 PM IST
BJP Protests Against Hike in Electricity Charges : విద్యుత్ ఛార్జీలు పెంపుతో వైసీపీ ప్రభుత్వం పేద ప్రజల నడ్డి విరుస్తోందని బీజేపీ నాయకులు ఆరోపించారు. విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ తిరుపతి ఏపీఎస్పీడీసీఎల్ కేంద్ర కార్యాలయం ఎదుట బీజేపీ నాయకులు బైఠాయించారు. విద్యుత్ ఛార్జీల పెంచనని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పిన జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎనిమిది సార్లు పెంచారని ఆరోపించారు. ఇప్పటి వరకు పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలను చేస్తామని హెచ్చరించారు.
Jagan's Government Cheated People : మాట తప్పను మడమ తిప్పను అని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పిన జగన్ అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీలను గాలికి వదిలేశారని బీజేపీ నాయకులు విమర్శించారు. విద్యుత్ ఛార్జీలు పెంపుతో జగన్ ప్రజలకు షాక్ ఇస్తే, రానున్న ఎన్నికల్లో ప్రజలు జగన్కు షాక్ ఇస్తారని తెలిపారు. పరిపాలన ముందుచూపు లేకపోవడం వల్లనే ప్రస్తుతం రాష్ట్రంలో బొగ్గు నిల్వలు తగ్గిపోయాయని వ్యాఖ్యానించారు. ఇప్పటి వరకు పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు.