BJP National Secretary Satyakumar Comments on Jagan: జగన్ పాలనను గాలికి వదిలేసి ప్రతిపక్షాలను అణచడమే లక్ష్యంగా పెట్టుకున్నారు: సత్యకుమార్ - AP Rank in Crime
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 25, 2023, 3:35 PM IST
BJP National Secretary Satyakumar Comments on Jagan: సీఎం జగన్ పాలనను గాలికి వదిలేసి ప్రతిపక్షాలను అణచివేయటమే లక్ష్యంగా పెట్టుకున్నారని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ మండిపడ్డారు. అనంతపురంలో మీడియా సమావేశం నిర్వహించిన సత్యకుమార్ రాష్ట్ర ప్రభుత్వ తీరును తప్పుపట్టారు. ప్రజా సమస్యల నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి ప్రతిపక్షాలపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో కరవు పరిస్థితులపై, రైతులను ఆదుకోవటంపై సీఎం జగన్ మోహన్ రెడ్డి ఒక్క సమీక్ష చేసినా.. బాధ్యతకలిగిన ముఖ్యమంత్రిగా ప్రజలు భావిస్తారని ఆయన అన్నారు.
రాష్ట్రంలో విద్యారంగాన్ని గందరగోళంగా మార్చారని, కొత్తగా ఐబీ సిలబస్ తీసుకొచ్చారని విమర్శించారు. తెలుగు మీడియాన్ని రద్దు చేసి ఇంగ్లీష్ మీడియం అన్నారు, ఇపుడు ఐబీ సిలబస్ అంటున్నారు, రాష్ట్రంలో విద్యార్థుల భవిష్యత్‌ను ఏమి చేయాలంటున్నారని సత్యకుమార్ ప్రశ్నించారు. ప్రభుత్వ పాఠశాలల్లో బోర్డు ఉంటే చాక్ పీస్ ఉండదని ఇలాంటి పరిస్థితుల్లో ఐబీ సిలబస్ ఎలా అమలు చేస్తారన్నారు. అధికారులు, అడ్వకేట్ జనరల్‌లు మీడియా సమావేశాలు పెట్టడం, ప్రతిపక్ష నేతలపై ఆరోపణలు చేయటం ఏమిటని ఆయన అన్నారు. స్కిల్ డెవలప్మెంట్ సంస్థకు సంబంధించి చంద్రబాబుపై పెట్టిన అక్రమ కేసుల వ్యవహారంపై స్పందించిన సత్యకుమార్.. అరెస్టు చేసిన తీరును తప్పుపట్టారు. హత్యలు, అత్యాచారాలు జరుగుతున్న రాష్ట్రంగా ఏపీనే తొలిస్థానంలో ఉందన్నారు.