BJP National Secretary Satya Kumar: 'వైఎస్సార్సీపీ రాక్షస కబంద హస్తాల నుంచి రాష్ట్రానికి విముక్తి కల్పించాలి' - guntur polittical news
🎬 Watch Now: Feature Video
BJP Leader Satya Kumar Comments On Jagan : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని స్పష్టమైన ఘంటా పదాన్ని వినిపిస్తూ దాని కోసమే బీజేపీ కట్టుబడి ఉందని, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వికృత పోకడలపై నిరంతరం బీజేపీ పోరాడుతూనే ఉందని, వైఎస్సార్సీపీ ప్రభుత్వ రాక్షస కబంద హస్తాల నుంచి రాష్ట్రానికి విముక్తి కల్పించాలని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్య కుమార్ పేర్కొన్నారు. గుంటూరులోని హైందవ ధర్మ శంఖారావ సభా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
ప్రతిపక్షంలో ఒక మాట అధికారం వచ్చాక ఒక మాట మాట్లాడే అసత్య ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అని దుయ్యపట్టారు. మూడు రాజధాని చెప్పే మాట ఒక బూటకం అన్నారు. మూడు రాజధానులని చెప్పి మూడు ప్రాంతాలను దోచుకుని మూడు ముక్కలాట ఆడుతూ ప్రాంతాల మధ్య వైశమ్యాలను ప్రేరేపిస్తూ రాజకీయ లబ్ధి పొందుతున్నారని పేర్కొన్నారు. జనసేన పార్టీతో పొత్తుపై కేంద్ర నిర్ణయమే తుది నిర్ణయం అన్నారు. రాజకీయ పార్టీల భావజాలాలు వేరైనా రాష్ట్రంలో సమస్యలపై పోరాడుతున్న విధానం మాత్రం ఒక్కటే, పవన్ కల్యాణ్ ప్రతిపాదనలు కూడా అవే కాబట్టి అందుకు బీజేపీ స్వాగతిస్తుందని సత్య కుమార్ తెలిపారు.